మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..! | Babar Azam Suddenly Enters Pakistan Captaincy Race As PCB Eyes Leadership Change Amid Teams Poor Form, Check Details Inside | Sakshi
Sakshi News home page

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

Jul 4 2026 8:59 AM | Updated on Jul 4 2026 9:53 AM

Babar Azam Suddenly Enters Pakistan Captaincy Race

పాకిస్తాన్ క్రికెట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మళ్లీ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్ స్థానంలో ఆయనను తిరిగి నియమించే దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

గత రెండేళ్లుగా పాకిస్తాన్ టెస్ట్ జట్టు ప్రదర్శన దారుణంగా దిగజారింది. పసికూన బంగ్లాదేశ్‌ చేతిలో స్వదేశంలో సిరీస్‌ సహా రెండు సిరీస్‌ల్లో ఓడింది. దీంతో బాబర్‌ ఆజం మళ్లీ టెస్ట్ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వెస్టిండీస్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బాబర్‌కు పగ్గాలు అప్పజెప్పవచ్చన సమాచారం.

బాబర్‌ 2019-2023 మధ్యలో పాక్‌ ఆల్‌ ఫార్మాట్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2023 వరల్డ్ కప్ తర్వాత ఆ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. 2024లో మళ్లీ వైట్-బాల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నప్పటికీ, అదే ఏడాది చివర్లో మరోసారి రాజీనామా చేశాడు.

ప్రస్తుతం షాన్ మసూద్ పాక్‌ టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అతని ట్రాక్‌ రికార్డు దారుణంగా ఉంది. అతని నాయకత్వంలో పాకిస్తాన్ 16 టెస్టుల్లో 12 మ్యాచ్‌లు ఓడిపోయింది. కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. దీంతో WTC 2023–25 సీజన్‌ను పాకిస్తాన్ చివరి స్థానంలో ముగించింది.

టెస్ట్‌ కెప్టెన్సీ విషయంలో వైట్-బాల్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పేరు కూడా పరిశీలనలోకి వచ్చినా, ఆయన ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో చివరకు బాబర్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.

బాబర్ ఆజం కెప్టెన్సీ రికార్డు చూస్తే, ఇప్పటివరకు 148 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించి 84 విజయాలు సాధించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉండగా 10 విజయాలు, 6 పరాజయాలు నమోదు చేశాడు. ఈ గణాంకాల ఆధారంగా PCB అతనికే మళ్లీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement