టీమిండియా ఓటమి | IND VS ENG 5th T20I: updates and Highlights | Sakshi
Sakshi News home page

టీమిండియా ఓటమి

Jul 11 2026 6:41 PM | Updated on Jul 11 2026 11:17 PM

IND VS ENG 5th T20I: updates and Highlights

ఐదో మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి
ఐదో టీ20లోనూ టీమిండియా ఓటమిపాలైంది. తద్వారా సిరీస్‌ను 0-4తో కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.

జోస్‌ బట్లర్‌ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (45 బంతుల్లో 95 నాటౌట్‌; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఇషాన్‌ కిషన్‌ (56) ఔట్‌
12.4వ ఓవర్‌- ఇషాన్‌ కిషన్‌ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు). స్కోర్‌ 131-4. 

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
10.1వ ఓవర్‌- శ్రేయస్‌ అయ్యర్‌ (28) ఔట్‌

సంజూ శాంసన్‌ ఔట్‌
5.1వ ఓవర్‌- 55 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. సామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో జేకబ్‌ బేతెల్‌కు క్యాచ్‌ ఇచ్చి సంజూ శాంసన్‌ (27) ఔటయ్యాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
2.3వ ఓవర్‌- 25 పరుగుల వద్ద భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ (3) ఔటయ్యాడు. 

బట్లర్‌ సెంచరీ.. ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌
సౌతాంప్టన్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఐదో టీ20లో ఇంగ్లండ్‌ అతి భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 

కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (45 బంతుల్లో 95 నాటౌట్‌; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌ (4-0-60-0), అక్షర్‌ పటేల్‌ (4-0-63-0) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శివమ్‌ దూబే ఒకే ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే అదే ఓవర్‌లో 2 వికెట్లు తీశాడు. 

భారత బౌలర్లను చీల్చిచెండాతున్న బ్రూక్‌
బ్రూక్‌ 32 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 నాటౌట్‌
బట్లర్‌ 44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 72 నాటౌట్‌
14 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 168-1

అర్ద సెంచరీలు పూర్తి చేసుకున్న బ్రూక్‌, బట్లర్‌
హ్యారీ బ్రూక్‌ (56), జోస్‌ బట్లర్‌ (72) ధాటిగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 146-1గా ఉంది.

ధాటిగా ఆడుతున్న బ్రూక్‌
వన్‌డౌన్‌లో వచ్చిన హ్యారీ బ్రూక్‌ ధాటిగా ఆడుతున్నాడు. 11 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. జోస్‌ బట్లర్‌ 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 40 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 73-1గా ఉంది. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
1.4వ ఓవర్‌- ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో సూర్యాంశ్‌ షేడ్గేకు క్యాచ్‌ ఇచ్చి ఫిల్‌ సాల్ట్‌ (6) ఔటయ్యాడు.

మళ్లీ టాస్‌ గెలిచిన శ్రేయస్‌.. ఈసారైనా మ్యాచ్‌ గెలిచేనా..?
శ్రేయస్‌ అయ్యర్‌ వరుసగా ఏడో మ్యాచ్‌లో టాస్‌ గెలిచాడు. ఈసారైనా మ్యాచ్‌ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. టాస్‌ గెలిచిన శ్రేయస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ రెండు మార్పులు చేసింది. వైభవ్‌ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్‌.. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో సూర్యాంశ్‌ షేడ్గే జట్టులోకి వచ్చారు.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్

7:15 గంటలకు టాస్‌
భారత జట్టు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో టాస్‌ 45 నిమిషాలు ఆలస్యమైంది. భారతకాలమానం ప్రకారం 7:15 గంటలకు టాస్‌ పడుతుంది. 

టాస్‌ ఆలస్యం.. కారణమిదే..!
భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య సౌతాంప్టన్‌ వేదికగా ఇవాళ (జులై 11) ఐదో టీ20 జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ టాస్‌ ఆలస్యమైంది. భారత జట్టు ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం చేత ఆలస్యమైనట్లు తెలుస్తోంది. అయితే కొద్ది క్షణాల క్రితం టీమిండియా స్టేడియంకు చేరుకున్నట్లు అప్‌డేట్‌. మరికొద్ది నిమిషాల్లో టాస్‌ పడే అవకాశం ఉంది.

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే 0-3 తేడాతో కోల్పోయింది. తొలి టీ20 వర్షం​ కారణంగా రద్దు కాగా.. తర్వాత మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలుపొందింది. ఇవాళ నామమాత్రపు చివరి మ్యాచ్‌ జరుగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement