Photo Credit: BCCI Twitter
భారత ఆటగాడు అజింక్య రహానే ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ పొందిన ఆటగాళ్లకు బీసీసీఐ పెన్షన్ అందిస్తుంది. రహానే సీనియర్ టెస్టు క్రికెటర్ కావడంతో, అతడు నెలకు పెన్షన్ కింద రూ. 70వేలు అందుకోనున్నాడు.
ఈ సంగతి పక్కనబెడితే క్రికెట్ చరిత్రలో బీసీసీఐ (భారత్), ఈసీబీ (ఇంగ్లండ్), క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ సంపన్న బోర్డులుగా గుర్తింపు పొందాయి. కానీ ఈ మూడు బోర్డుల్లో బీసీసీఐ మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లకు గౌరవ వేతనం కింద పెన్షన్ అందిస్తుండడం విశేషం.
అటు ఆస్ట్రేలియా కానీ.. ఇటు ఇంగ్లండ్ కానీ తమ మాజీ ఆటగాళ్లకు ఎలాంటి పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదు. దీంతో క్రికెట్ చరిత్రలోనే మాజీ ఆటగాళ్లకు పెన్షన్ కల్పిస్తున్న ఏకైక బోర్డుగా బీసీసీఐ చరిత్ర సృష్టించింది. బీసీసీఐ అందిస్తున్న పెన్షన్ విధానాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం.
బీసీసీఐ కల్పిస్తున్న పెన్షన్ వివరాలు
👉మాజీ క్రికెటర్లు: నెలకు రూ. 58,750
👉టెస్టు క్రికెటర్లు: నెలకు రూ. 60 వేలు
👉సీనియర్ టెస్టు క్రికెటర్లు: నెలకు రూ. 70 వేలు
👉ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు: నెలకు రూ. 30 వేల నుంచి 45వేలు
👉అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు: నెలకు రూ. 52,500
👉దేశవాళీ మహిళా క్రికెటర్లు: నెలకు రూ. 45వేలు
ఇక దేశవాళీ క్రికెట్‌లో రాష్ట్రాల వారీగా చూసుకుంటే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తమ రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ ఆడిన 150 మంది మాజీ క్రికెటర్లకు పెన్షన్‌తో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఆదర్శంగా నిలిచింది. మిగతా రాష్ట్రాల బోర్డులు కూడా తమ మాజీ క్రికెటర్లకు తమకు తోచినంత పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
🔴 NO AUSTRALIA, NO ENGLAND- ONLY BCCI PAYS CRICKETERS AFTER RETIREMENT 🤯
- Cricket Australia: No pension system
- England Cricket: No pension system
BCCI: Pays an avg pension of ₹58,750/month to former cricketers.
Current BCCI pension structure:
- Test cricketers:… pic.twitter.com/HM0Y3aBMqr— Sam (@cricsam02) August 3, 2026
Read: ప్రేమకు ఎండ్‌కార్డ్.. గర్ల్‌ఫ్రెండ్‌తో రొనాల్డో పెళ్లి ఎప్పుడంటే?


