source: X
టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ క్రికెటేతర విషయానికి సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడు పంజాబీ నటి, మోడల్ సమ్రీన్ కౌర్‌తో రిలేషన్‌లో ఉన్నాడని ఇటీవల సోషల్‌మీడియా కోడై కూసింది. ఆ ప్రచారం నిజమేనని తాజాగా జరిగిన ఓ ఉదంతంతో స్పష్టమైంది.
సమ్రీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేయగా అర్షదీప్ స్పందించాడు. ఎలుగుబంటి, రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్ చేశాడు. దీనికి సమ్రీన్ కూడా రెడ్ హార్ట్, లాక్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం బహిర్గతమైంది.
అర్ష్‌దీప్ కొద్ది రోజుల కిందట సమ్రీన్‌తో కలిసి ఉన్న రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి 'My Person' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ తర్వాతే అర్షదీప్-సమ్రీన్ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం మొదలైంది.
ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగానూ వీరిద్దరు కలిసి తిరిగినప్పటికీ.. అప్పట్లో ఇంత ప్రచారం జరగలేదు. అర్షదీప్-సమ్రీన్ రిలేషన్‌కు నెటిజన్లు ఫిక్స్ అయిపోయినప్పటికీ.. వారి నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అర్షదీప్ క్రికెట్‌తో, సమ్రీన్ సోషల్‌మీడియాలో బిజీగా ఉన్నారు.
అర్షదీప్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే వన్డేల్లో మాత్రం అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఒకే ఒక వన్డే ఆడి 0/72 గణాంకాలు నమోదు చేశాడు.
ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ 2026 కోసం అర్ష్‌దీప్ సింగ్ నార్త్ జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన కన్హయ్య వాధ్వాన్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ ఆటగాడు ఆయుష్ బదోనీ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.


