భారత సంతతి క్రికెట‌ర్‌పై ఐసీసీ 8 ఏళ్ల నిషేధం! | ICC Bans-USA-Player-Akhilesh-Reddy-Breaching Anti-Corruption Code | Sakshi
Sakshi News home page

భారత సంతతి క్రికెట‌ర్‌పై ఐసీసీ 8 ఏళ్ల నిషేధం!

Aug 3 2026 4:17 PM | Updated on Aug 3 2026 4:51 PM

ICC Bans-USA-Player-Akhilesh-Reddy-Breaching Anti-Corruption Code

భారత సంతతికి చెందిన అమెరికా క్రికెట‌ర్‌ బొదుగుమ్ అఖిలేశ్ రెడ్డిపై అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 8 ఏళ్లు నిషేధం విధించింది. అబుదాబి టీ20 లీగ్‌లో అవినీతి నిరోధ‌క నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన‌ట్లు గతేడాది నవంబ‌ర్‌లో అత‌డిపై అభియోగాలు వ‌చ్చాయి. ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేల‌డంతో అప్ప‌ట్లో ఐసీసీ అఖిలేష్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. 

తాజాగా ఐసీసీ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ కింద‌ ఆర్టిక‌ల్ 2.1.1, ఆర్టికల్ 2.1.4, ఆర్టిక‌ల్ 2.4.7కు చెందిన మూడు నిబంధ‌న‌ల‌ను అఖిలేష్ ఉల్లంఘించిన‌ట్లు తేల‌డంతో ఐసీసీ అత‌డిని దోషిగా నిర్ధారించింది. అత‌డిపై విధించిన 8 ఏళ్ల నిషేధం న‌వంబ‌ర్ 21, 2025 నుంచే అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని ఐసీసీ తెలిపింది. 8 ఏళ్ల త‌ర్వాత అంటే 2033లో అఖిలేష్ మ‌ళ్లీ క్రికెట్ ఆడేందుకు అనుమ‌తి ఉంటుంది. 

అప్ప‌టికీ అత‌డి వ‌య‌సు 33 ఏళ్లు నిండుతాయి కాబట్టి అతడి కెరీర్‌కు ఎండ్‌కార్డ్‌ పడినట్లే. యూఎస్‌ఏ తరఫున క్రికెట్‌ ఆడిన అఖిలేష్ రెడ్డి 2000లో అమెరికాలోనే జ‌న్మించాడు. అమెరికాలో జ‌న్మించిన‌ప్ప‌టికీ క్రికెట్‌లో పేరు వ‌చ్చింది మాత్రం హైద‌రాబాద్‌కు ఆడడం ద్వారానే. హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) త‌ర‌ఫున దేశ‌వాళీ డొమొస్టిక్ టోర్నీల్లో ఆడిన అఖిలేష్ అబుదాబి టీ10 లీగ్‌లో యూపీ న‌వాబ్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ ఫ్రాంచైజీకి ఆడుతున్న స‌మ‌యంలో అత‌డిపై అవినీతి నిరోధ‌క నియ‌మాల‌ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

అఖిలేష్ ఉల్లంఘించిన నిబంధ‌న‌లివే..
👉ఆర్టికల్ 2.1.1-అబుదాబి టీ10 లీగ్ 2025లో మ్యాచ్‌ల ఫలితం, పురోగతి, నిర్వహణ లేదా ఇతర అంశాన్ని నిర్ధారించడానికి, కుట్ర పన్నడానికి లేదా ఇతరత్రా అనుచితంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం, లేదా ఏ విధంగానైనా నిర్ధారించడానికి లేదా కుట్ర పన్నడానికి లేదా ఇతరత్రా అనుచితంగా ప్రభావితం చేయడానికి చేసే ఒప్పందంలో కుట్ర‌దారుడిగా తేలడం.

👉ఆర్టికల్ 2.1.4- అబుదాబి టీ10 లీగ్‌లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లలో ఆర్టికల్ 2.1.1ను ఉల్లంఘించాల‌ని వేరే వాళ్ల‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా ప్రేరేపించడం, ప్రలోభాల‌కు గురి చేయ‌డం,  ప్రోత్సహించడం లేదా ఉద్దేశపూర్వకంగా సులభతరం చేయ‌డానికి ప్ర‌య‌త్నించడం.

👉ఆర్టికల్ 2.4.7-విచార‌ణ‌లో భాగంగా దర్యాప్తుకు ఆటంకం క‌లిగించేలా త‌న వ‌ద్ద ఉన్న డేటా, స‌మాచారాన్ని దొర‌క్కుండా చేయ‌డం లేదా తొల‌గించ‌డం.

👉ఇక బొదుగుమ్ అఖిలేష్ రెడ్డి అమెరికా త‌ర‌ఫున నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్‌లు క‌లిపి అఖిలేష్ ఒక వికెట్ మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. ఇక మేజ‌ర్ లీగ్ క్రికెట్ టోర్నీలో తొలి రెండు ఎడిష‌న్ల‌లో వాషింగ్ట‌న్ ఫ్రీడ‌మ్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన‌ప్ప‌టికీ ఒక్క‌సారి కూడా జ‌ట్టులో ఆడే అవ‌కాశం ల‌భించ‌లేదు.

Read: సొంత జ‌ట్టుతో గొడవ.. పంజాబ్ ఆల్‌రౌండ‌ర్ కీలక నిర్ణ‌యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement