హండ్రెడ్‌ టోర్నీలో స్మృతి మంధాన‌ విధ్వంసం! | Mandhana-Shines-Manchester Super Giants Women-4th Win-Hundred Womens | Sakshi
Sakshi News home page

హండ్రెడ్‌ టోర్నీలో స్మృతి మంధాన‌ విధ్వంసం!

Aug 2 2026 9:23 PM | Updated on Aug 2 2026 9:28 PM

Mandhana-Shines-Manchester Super Giants Women-4th Win-Hundred Womens

Photo Credit: Hundred Twitter

హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీష‌న్‌లో భార‌త స్టార్ బ్యాట‌ర్ స్మృతి మంధాన త‌న ప్ర‌ద‌ర్శ‌నతో అద‌ర‌గొట్టింది. హండ్రెడ్ టోర్నీలో మంధాన మాంచెస్ట‌ర్ సూప‌ర్ జెయింట్స్ వుమెన్ టీంకు ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. ఆదివారం లండ‌న్ వేదిక‌గా ఎంఐ లండ‌న్ వుమెన్స్‌తో  జ‌రిగిన మ్యాచ్‌లో మాంచెస్ట‌ర్ సూప‌ర్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. 

ఓపెన‌ర్ స్మృతి మంధాన (27 బంతుల్లో 34 ; 4 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌) దనాధన్‌ ఇన్నింగ్స్‌తో అలరించింది. మ‌రో ఓపెన‌ర్ అయిన కెప్టెన్ మెగ్ లానింగ్ (31 బంతుల్లో 43) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో ఎంఐ లండన్‌ విధించిన 93 ప‌రుగుల టార్గెట్‌ను మాంచెస్ట‌ర్ సూప‌ర్ జెయింట్స్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ లండ‌న్ వుమెన్స్ జ‌ట్టు 99 బంతుల్లో 92 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కిరా ఛ‌త్లీ (18), నికోలా కేరీ (17), చిన్నెల్లె హెన్రీ (16) ప‌ర్వాలేద‌నిపించారు. మాంచెస్ట‌ర్ బౌల‌ర్ల‌లో రియానా మెక్‌డొనాల్డ్ మూడు వికెట్లు తీయ‌గా, మైట్లన్ బ్రౌన్, సోఫి ఎసెల్‌స్టోన్ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.  మాంచెస్ట‌ర్ సూప‌ర్‌జెయింట్స్‌కు ఇది మూడో విజ‌యం కాగా.. ఎంఐ లండ‌న్ వుమెన్స్ మ‌రో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. దీంతో సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఖాతా తెర‌వ‌ని జ‌ట్టుగా ఎంఐ లండ‌న్ వుమెన్స్ చెత్త రికార్డు మూట‌గ‌ట్టుకుంది.

 

Read: యువరాజ్ సింగ్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement