47 ఏళ్ల రికార్డును సమం చేసిన పాక్‌ బౌలర్‌ | Mohammad Abbas Unknowingly Equals 47 Year Old Pakistan Record | Sakshi
Sakshi News home page

47 ఏళ్ల రికార్డును సమం చేసిన పాక్‌ బౌలర్‌

Aug 3 2026 3:13 PM | Updated on Aug 3 2026 3:26 PM

Mohammad Abbas Unknowingly Equals 47 Year Old Pakistan Record

source: X

వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్‌ జట్టులో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తొలి టెస్ట్‌లో 8 వికెట్లతో (రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన) సత్తా చాటినప్పటికీ, రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ మహ్మద్‌ అబ్బాస్‌ను ప్లేయింగ్‌ ఎలెవెన్‌ నుంచి తప్పించారు. ఈ ఆశ్చర్యకర పరిణామం ద్వారా అబ్బాస్‌ ఓ పాకిస్తాన్‌ రికార్డును సమం చేశాడు.

ముందు మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసినా, ఆ తర్వాతి మ్యాచ్‌లో జట్టులో చోటు దక్కని రెండో పాకిస్తానీ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

47 ఏళ్ల ముందు (1979-80) భారత పర్యటనలో ఎహ్తెషాముద్దీన్‌ నాలుగో టెస్టులో ఐదు వికెట్ల ‍ప్రదర్శనతో (5/47) సత్తా చాటాడు. కానీ ఆ తర్వాతి టెస్టులో అప్పటి కెప్టెన్‌ అసిఫ్‌ ఇక్బాల్‌ అతడిని తప్పించి ఇమ్రాన్‌ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నాడు. తాజాగా అబ్బాస్‌ కూడా ముందు టెస్టులో 5 వికెట్లు తీసినప్పటికీ, తదుపరి టెస్టులో ప్లేయింగ్‌ XIకి దూరమయ్యాడు.

అబ్బాస్‌ స్థానంలో నసీమ్‌ షా తమ్ముడు ఉబైద్‌ షా జట్టులోకి వచ్చాడు. అతడికి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ (రెండో టెస్ట్‌కు వేదిక) పరిస్థితులకు సరిపోడనే కారణంతో అబ్బాస్‌ను బెంచ్‌కు పరిమితం చేసినట్లు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం తెలిపాడు.

అయితే అబ్బాస్‌ను తప్పించడం సరైన నిర్ణయం కాదని మ్యాచ్‌ తొలి రోజే తేలిపోయింది. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఉబైద్‌ 9 ఓవర్లలో 56 పరుగులిచ్చి కేవలం ఒక వికెట్‌ మాత్రమే తీశాడు. దీంతో వెస్టిండీస్‌ 239/5తో తొలి రోజు ఆట ముగించింది.

తొలి టెస్ట్‌లో బంతితో సత్తా చాటిన జస్టిన్‌ గ్రీవ్స్‌ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో రాణించి (64 నాటౌట్‌) విండీస్‌ జట్టును ఆదుకున్నాడు. అతడికి జతగా కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (36 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వెస్టిండీస్‌ 1-0 ఆధిక్యంలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement