టాప్‌-5 బెస్ట్‌ బౌలర్లు వీరే.. సారీ భాయ్‌ నువ్వే లాస్ట్‌! | Arshdeep Singh Picks Top 5 Greatest Indian Bowlers, Apologizes to Ashwin | Sakshi
Sakshi News home page

నా టాప్‌-5 టీమిండియా బౌలర్లు వీరే.. సారీ భాయ్‌ నువ్వే లాస్ట్‌!

Aug 3 2026 1:08 PM | Updated on Aug 3 2026 1:25 PM

Arshdeep Singh Picks His Top 5 Greatest Bowlers Says Sorry To Legend

PC: Arshdeep Singh X

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌కు తాను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతానని పేర్కొన్నాడు. అసలు విషయం ఏమిటంటే...

టాప్‌-5 బెస్ట్‌ బౌలర్లు వీరే
ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన అర్ష్‌దీప్‌ సింగ్‌ ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో క్రిషాంక్‌ ఆత్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ తన టాప్‌-5 టీమిండియా బౌలర్ల పేర్లను వెల్లడించాడు. ఈ జాబితాలో  వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు అర్ష్‌ అగ్రస్థానమిచ్చాడు.

భువీనే ఎందుకంటే..
ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘భువీ భాయ్‌ అంటే వ్యక్తిగతంగా నాకెంతో ఇష్టం. కాబట్టి నేను ఆయనకే ఓటు వేశాను. భువీ భాయ్‌ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటాడు. ఇక రెండో స్థానంలో షమీ భాయ్‌కు నేను చోటిస్తాను.

ఎలాంటి వికెట్‌ మీదనైనా సీమ్‌ రాబట్టగల సత్తా అతడి సొంతం. షమీ భాయ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడు. మూడో స్థానానికి కుల్దీప్‌ యాదవ్‌ను ఎంచుకుంటాను. అతడికి అరుదైన బౌలింగ్‌ నైపుణ్యాలు ఉన్నాయి. అతడు లెఫ్టార్మ్‌ చైనామన్‌ బౌలర్‌.

ఇక నాలుగో స్థానంలో యుజీ భాయ్‌ ఉంటాడు. పంజాబ్‌ జట్టులో నాకు అతడు సహచరుడు. ఐపీఎల్‌లో అతడి రికార్డు అమోఘం. అత్యధిక వికెట్లు కూల్చిన ఘనత యుజీ భాయ్‌కు ఉంది’’ అని అర్ష్‌దీప్‌ సింగ్‌ పేర్కొన్నాడు.

సారీ భాయ్‌.. నువ్వే లాస్ట్‌!
అదే విధంగా.. ‘‘నిజానికి అశూ భాయ్‌ (అశ్విన్‌)ను నేను ఈ జాబితాలో చివరి స్థానంలో పెట్టాలనుకోలేదు. కానీ టాప్‌-5లో ఇంకా చోటు లేదు కాబట్టి తప్పడం లేదు. ఆయన ఒక దిగ్గజం. ఐపీఎల్‌లో నాకు అశూ భాయ్‌నే మొదటి కెప్టెన్‌. సారీ భాయ్‌. నీకు నేను వ్యక్తిగతంగా మెసేజ్‌ చేస్తాను’’ అని అర్ష్‌దీప్‌ సింగ్‌ సరదాగా వ్యాఖ్యానించాడు.

చదవండి: బుమ్రా అవుట్‌.. రీప్లేస్‌మెంట్‌ ప్రకటించిన బీసీసీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement