భారత జెర్సీలో భువనేశ్వర్(ఫైల్ ఫోటో)
టీమిండియాలోకి వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి తీసుకోవాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ చేరాడు. వన్డే ప్రపంచకప్-2027 టోర్నీకి తను ఎంపిక చేసిన భారత జట్టులో భవీకి కార్తీక్‌కు చోటిచ్చాడు.
అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్ కూడా తన వరల్డ్‌కప్ జట్టులో భువనేశ్వర్‌కు అవకాశమిచ్చాడు. కాగా భువనేశ్వర్ గత నాలుగేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు దేశవాళీ టీ20 క్రికెట్ లీగ్స్‌లో మాత్రమే ఆడుతున్నాడు.
అయితే భువీలో ఏ మాత్రం జోరు తగ్గలేదు. ఈ క్రమంలోనే అతడిని జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లను సూచిస్తున్నారు. కాగా దినేష్ కార్తీక్ తను ఎంపిక జట్టులో భువీతో పాటు మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి ఛాన్స్ ఇచ్చాడు. షమీ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.
ఇక డికే జట్టులో ఓపెనర్లగా శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మలు ఉన్నారు. బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైశ్వాల్‌కు చోటు కల్పించాడు. విరాట్ కోహ్లి, కుల్దీప్ యాదవ్, బుమ్రా వంటి సీనియర్ ప్లేయర్లు ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లను కార్తీక్ ఎంపిక చేశాడు. అయితే తను సెలక్ట్ చేసిన జట్టులో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.
కార్తీక్ డ్రీమ్ టీమిండియా ఇదే
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్


