దక్షిణాఫ్రికా, జింబాబ్వే వేదికలుగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2027 టోర్నీ దృష్ట్యా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైట్ బాల్ క్రికెట్‌లో యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా 'నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026' అనే సరికొత్త టోర్నమెంట్‌ను పీసీబీ తీసుకొచ్చింది.
సోమవారం ఈ లీగ్ ప్రారంభ ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పీసీబీ విడుదల చేసింది. షెడ్యూల్‌తో పాటు పాల్గోనే మొత్తం నాలుగు జట్లను కూడా ప్రకటించారు. ఈ టోర్నీ ఆగస్టు 11 నుంచి ఆగస్టు 18 వరకు కేవలం వారం రోజుల పాటు జరగనుంది. మొత్తం మ్యాచ్‌లన్నింటికి ముల్తాన్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
ఈ ఈవెంట్ లీగ్ దశ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ప్రతీ జట్టు మిగతా జట్లతో ఒకసారి తలపడనుంది. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఆగస్టు 18న జరిగే గ్రాండ్ ఫైనల్‌లో తాడోపేడో తెల్చుకోనున్నాయి.
కాగా ఈ లిస్ట్-ఎ క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ అగ్రశ్రేణి ఆటగాళ్లు షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్, సాహిబ్‌జాదా ఫర్హాన్ పాల్గోనున్నారు. వీరు నలుగురు కెప్టెన్లగా వ్యవహరించనున్నారు.
జట్ల వివరాలు:
పాకిస్థాన్ గ్రీన్: షాదాబ్ ఖాన్ (కెప్టెన్), ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఫర్హాన్ యూసుఫ్, మెహ్రాన్ ముంతాజ్, మహమ్మద్ హస్నైన్, మహమ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, ఉమైర్ బిన్ యూసుఫ్, సాద్ బైగ్ (వికెట్ కీపర్), సమీర్ మిన్హాస్.
పాకిస్థాన్ వైట్స్: సైమ్ అయూబ్ (కెప్టెన్), ఆకిఫ్ జావేద్, అలీ రజా, హ్యారీస్ రౌఫ్, హసన్ నవాజ్, ఖుష్‌దిల్ షా, మొహ్సిన్ రియాజ్, మహమ్మద్ వసీమ్ జూనియర్, సాద్ మసూద్, షెహ్‌జాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).
పాకిస్థాన్ బ్లూస్: సాహిబ్‌జాదా ఫర్హాన్ (కెప్టెన్), అహ్మద్ దానియల్, అరఫాత్ మిన్హాస్, హసన్ అలీ, హుస్సేన్ తలాత్, జహాన్ దాద్ ఖాన్, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), షామిల్ హుస్సేన్, సుఫియాన్ మోకిమ్, తైమూర్ ఖాన్ (వికెట్ కీపర్), తయ్యాబ్ తాహిర్.
పాకిస్థాన్ గోల్డ్: షాహీన్ షా అఫ్రీది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్దుల్ సుభాన్, ఫైసల్ అక్రమ్, హైదర్ అలీ, కమ్రాన్ గులామ్, మాజ్ సదాకత్, మహమ్మద్ నవాజ్, ముహమ్మద్ అఖ్లాక్ (వికెట్ కీపర్), ముహమ్మద్ ఇమ్రాన్, సాద్ ఖాన్.


