'అతడిని పక్కన పెట్టాల్సిన టైమ్‌ వచ్చేసింది' | Abhishek Sharma under pressure, Kris Srikanth backs Sanju Samsons India XI return | Sakshi
Sakshi News home page

'అతడిని పక్కన పెట్టాల్సిన టైమ్‌ వచ్చేసింది'

Jul 27 2026 6:41 PM | Updated on Jul 27 2026 6:49 PM

Abhishek Sharma under pressure, Kris Srikanth backs Sanju Samsons India XI return

జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ... స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ మాత్రం మేనెజ్‌మెంట్‌ను తీవ్ర క‌ల‌వ‌ర‌పెడుతోంది. 

ఇంగ్లండ్ టూర్‌లో ఆశించిన స్థాయిలో రాణించ‌లేపోయిన అభిషేక్‌.. జింబాబ్వే గ‌డ్డ‌పై అంత‌కంటే దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. మూడు మ్యాచ్‌ల‌లోనూ సింగిల్ డిజిట్ స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. 

ఈ ఎస్ఆర్‌హెచ్ స్టార్ ఓపెన‌ర్ మూడు మ్యాచ్‌ల్లో క‌లిపి కేవ‌లం 11 ప‌రుగులు చేశాడు. ఈ నేప‌థ్యంలో భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. అభిషేక్ శర్మ బదులుగా సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలని శ్రీకాంత్ సూచించాడు.

కాగా టీ20 వరల్డ్‌కప్-2026 హీరో శాంసన్‌ను జింబాబ్వే పర్యటన నుంచి సెలక్టర్లు తప్పించారు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అతడి స్ధానంలో అవకాశమిచ్చారు. అంతకుముందు ఇంగ్లండ్ టూర్‌లోనూ మూడు మ్యాచ్‌లకు సంజూను తుది జట్టు నుంచి పక్కన పెట్టారు. 

అయితే ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో మాత్రం ఈ కేరళ ఆటగాడు ఉన్నాడు. అయితే వైభవ్‌ సూర్యవంశీ మెరుగ్గా రాణించడంతో ఆసియా గేమ్స్‌ నుంచి కూడా శాంసన్‌ను తప్పించే అవకాశముంది.

"అభిషేక్ శర్మ బలహీనతను ప్రత్యర్ధి జట్లు పసిగట్టేశాయి. వన్డే వరల్డ్‌కప్ నుంచి అతడి ప్రదర్శనలు అంతంతమాత్రమే గానే ఉన్నాయి. అతడి విషయంలో సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోక తప్పుదు. అభిషేక్ శర్మ స్ధానంలో సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలి. 

అతడికి కచ్చితంగా సెలక్టర్ల నుంచి పిలుపు వస్తుందని నమ్ముతున్నాను. అదేవిధంగా జింబాబ్వే పర్యటనలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన యువ పేసర్ మయాంక్ యాదవ్‌పై శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. మయాంక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 6.5 ఏకానమీ రేటుతో 5 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement