మళ్లీ తస్సుమన్న అభిషేక్‌.. వైభవ్‌ ధాటిగా ఆడినా..! | IND VS ZIM 2nd T20I: Abhishek sharma failure continues, out for 8 runs | Sakshi
Sakshi News home page

మళ్లీ తస్సుమన్న అభిషేక్‌.. వైభవ్‌ ధాటిగా ఆడినా..!

Jul 25 2026 5:00 PM | Updated on Jul 25 2026 5:04 PM

IND VS ZIM 2nd T20I: Abhishek sharma failure continues, out for 8 runs

source: BCCI X

టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో అతడు నిరాశపరిచాడు. చివరిగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అర్ద సెంచరీ చేసిన అతడు.. ఆతర్వాత వరుసగా 43, 10, 16, 3, 1 పరుగుకు ఔటయ్యాడు.

ఇవాళ (జులై 25) జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో ఓ మోస్తరు స్టార్ట​్‌ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక వికెట్‌ పారేసుకున్నాడు. 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 8 పరుగులు చేసి బ్లెస్సింగ్‌ ముజరబానీ బౌలింగ్‌లో ర్యాన్‌ బర్ల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

అభిషేక్‌ త్వరగా ఔట్‌ కావడంతో రెండో టీ20లో భారత్‌ ఆదిలోనే ఒత్తిడిలో పడినట్లైంది. అతడు ఔటైన వెంటనే మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ కూడా ఔటయ్యాడు. తొలి మ్యాచ్‌ ఫామ్‌ను కొనసాగించిన వైభవ్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడతాడని భావిస్తే.. 9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 20 పరుగులు చేసి పెవిలియన్‌ బాట పట్టాడు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 29 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఇషాన్‌ కిషన్‌, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ రెండు మార్పులు చేసింది. అశోక్‌ కుమార్‌ స్థానంలో యశ్‌ ఠాకూర్‌ తుది జట్టులోకి వచ్చాడు. యశ్‌ ఠాకూర్‌కు ఇది తొలి టీ20 మ్యాచ్‌. కెప్టెన్‌ అయ్యాక వరుసగా ఏడు టాస్‌లు గెలిచిన శ్రేయస్‌ ఎట్టకేలకు ఎనిమిదో మ్యాచ్‌లో టాస్‌ ఓడాడు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement