టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ మరోసారి ఘూటు వ్యాఖ్యలు చేశారు. కోచ్‌గా గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన తప్పుబట్టారు. శివం దూబే, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లను మేనెజ్‌మెంట్ ఆల్‌రౌండర్లుగా పరిగణించడం పట్ల శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశారు.
"శివమ్ దూబే, హర్షిత్ రాణాలను ఆల్‌రౌండర్లుగా పరిగణించలేం. ఒకవేళ వారిద్దరిని ఆల్‌రౌండర్లు అంటే నేను కూడా గొప్ప ఆల్‌రౌండర్ అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా ఒక్కడే అసలైన ఆల్‌రౌండర్.
నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ ఆల్‌రౌండర్. అతడు 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలడు. ఇప్పటికైనా మేనెజ్‌మెంట్ సరైన ఆల్‌రౌండర్లను జట్టులోకి తీసుకోవాలని" శ్రీకాంత్ పేర్కొన్నారు. అదేవిధంగా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కచ్చితంగా వన్డే ప్రపంచకప్ జట్టులో ఉండాలని ఆయన సూచించారు.
కాగా యూకే పర్యటనలో భారత జట్టు వరుసగా మూడు సిరీస్‌లు కోల్పోవడంతో గంభీర్‌పై తీవ్రస్ధాయిలో విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ టీమిండియా విఫలమైంది. జట్టులో హార్దిక్ పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. శివమ్ దూబే ఉన్నప్పటికి ఆశించిన స్ధాయిలో రాణించలేకపోయాడు.
చదవండి: AFG vs IRE: అఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వేటు


