ఐర్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌తో రహమత్ షా అఫ్గానిస్తాన్ కెప్టెన్‌గా తన ప్రయణాన్ని ప్రారంభించనున్నాడు. హస్మతుల్లా షాహిది కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలను రహమత్‌కు ఏసీబీ అప్పగించింది.
ఇక గత నెలలో భారత్‌లో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఫజల్‌హాక్ ఫరూఖీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీపై మాత్రం అఫ్గాన్ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్దానంలో యామిన్ అహ్మద్‌జాయ్‌కి పిలుపునిచ్చారు.
అహ్మద్‌జాయ్ చివరగా అక్టోబర్ 2025లో అఫ్గాన్ తరపున ఆడాడు. ఈ జట్టులో అజ్మతుల్లా ఓమర్జాయ్, రషీద్ ఖాన్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఈ సిరీస్ వచ్చే నెలలో ఆగస్టు 5 నుండి ఆగస్టు 14 మధ్య జరగనుంది. వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.
అఫ్గానిస్తాన్ గత నెలలో భారత్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 0-3తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే అంతకుముందు అబుదాబిలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మాత్రం 3-0 తేడాతో అఫ్గాన్ విజయం సాధించింది.
చదవండి: IND vs ZIM: ‘అతడొక సంచలనం.. బౌలింగ్ కూడా చేయిస్తాం’


