అభిషేక్‌ శర్మ చెత్త రికార్డు.. భారత టీ20 క్రికెట్‌ చరిత్రలోనే | Abhishek Sharma Scripts Worst-Ever Record By An Indian In T20I History | Sakshi
Sakshi News home page

IND vs ZIM: అభిషేక్‌ శర్మ చెత్త రికార్డు.. భారత టీ20 క్రికెట్‌ చరిత్రలోనే

Jul 26 2026 7:16 PM | Updated on Jul 26 2026 7:28 PM

Abhishek Sharma Scripts Worst-Ever Record By An Indian In T20I History

జింబాబ్వే పర్యటనలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం జట్టు మేనెజ్‌మెంట్‌ను తీవ్ర కలవరపెడుతోంది. హరారే వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ అభిషేక్ విఫలమయ్యాడు. 

కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మరోసారి జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజార్‌బానీ బౌలింగ్‌లో అభిషేక్‌ దొరికిపోయాడు. ఈ సిరీస్‌లోని ప్ర‌తీ మ్యాచ్‌లోనూ అత‌డు సింగిల్ డిజిట్ స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఈ సిరీస్‌లోని 3 ఇన్నింగ్స్‌లలో కలిపి అభిషేక్ చేసింది కేవలం 11 పరుగులు మాత్రమే. 

దీంతో ఈ ఎస్ఆర్‌హెచ్ స్టార్ బ్యాట‌ర్ ఓ చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతి తక్కువ పరుగులు చేసిన భార‌త (టాప్‌-7) బ్యాటర్‌గా  అభిషేక్ శర్మ ఘోర రికార్డును మూటగట్టుకున్నాడు.

ఇంతకుముందు ఈ చెత్త రికార్డు టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్య‌ర్ పేరిట ఉండేది.  2019లో వెస్టిండీస్‌పై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అయ్య‌ర్ 14 ప‌రుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో అయ్య‌ర్‌ను అభిషేక్ దాటేశాడు.

3-మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతి త‌క్కువ‌ పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:
అభిషేక్ శర్మ – 11 పరుగులు (విత్ జింబాబ్వే, 2026)

శ్రేయస్ అయ్యర్ – 14 పరుగులు (వెస్టిండీస్, 2019)

హార్దిక్ పాండ్యా – 15 పరుగులు (న్యూజిలాండ్, 2017)

కేఎల్ రాహుల్ – 15 పరుగులు (ఇంగ్లాండ్, 2021)

దినేష్ కార్తీక్ – 17 పరుగులు (ఆస్ట్రేలియా, 2022)
చదవండి: 'వరల్డ్‌కప్‌ గెలవాలంటే అతడిని జట్టులోకి తీసుకోండి'
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement