source: X
నేపాల్ పేస్ బౌలర్ కరణ్ కేసీ వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి నేపాల్ పేసర్‌గా, సందీప్ లామిచ్ఛానే తర్వాత రెండో నేపాల్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ లీగ్-2లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కరణ్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కరణ్ 10 ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో రెండో వికెట్‌తో అతను 100 వికెట్ల మైలురాయిని తాకాడు.
2018లో నెదర్లాండ్స్‌పై వన్డే అరంగేట్రం చేసిన కరణ్.. 72 ఇన్నింగ్స్‌ల్లో 103 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ సామర్థ్యం కూడా కలిగిన కరణ్, ఈ ఫార్మాట్‌లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 700 పరుగులు కూడా చేశాడు. 34 ఏళ్ల కరణ్ టీ20 ఫార్మాట్లోనూ సత్తా చాటుతే 112 వికెట్లు తీశాడు.
నమీబియా-నేపాల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ (100) సెంచరీతో సత్తా చాటగా.. స్టీన్‌క్యాంప్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా.. నమీబియా భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే కరణ్ (10-2-29-5) అద్భుత స్పెల్‌తో వారి ఆశలు అడియాశలు చేశాడు.


