మాంట్రియల్: నేషనల్ బ్యాంక్ ఓపెన్ ఏటీపీ–1000 మాస్టర్స్ సిరీస్ టోరీ్నలో అమెరికా ప్లేయర్ బెన్ షెల్టన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో గత ఏడాది విజేత షెల్టన్ 6–3, 7–6 (7/4)తో అమెరికాకే చెందిన బ్రాండన్ నకషిమాపై విజయం సాధించాడు. 2019లో రాఫెల్ నాదల్ తర్వాత వరుసగా రెండేళ్లు ఈ టోర్నీ టైటిల్ నెగ్గిన షెల్టన్ ఈసారి ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు.
87 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో షెల్టన్ ఏడు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన షెల్టన్ తన సర్వీస్‌లో ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వలేదు. విజేతగా నిలిచిన షెల్టన్‌కు 15,14,200 డాలర్ల (రూ. 14 కోట్ల 48 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తాజా విజయంతో వచ్చే సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో షెల్టన్ ఆరో ర్యాంక్‌కు చేరుకుంటాడు.
టొరంటో: ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఈ ఏడాది తొలి టైటిల్‌ను సాధించింది. నేషనల్ బ్యాంక్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోరీ్నలో స్వియాటెక్ చాంపియన్‌గా నిలిచింది. కజకిస్తాన్‌కు చెందిన రెండో సీడ్ రిబాకినాతో జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ స్వియాటెక్ 6–2, 6–3తో విజయం సాధించింది.
స్వియాటెక్ కెరీర్‌లో ఇది 26వ సింగిల్స్ టైటిల్. 75 నిమిషాలపాటు జరిగిన టైటిల్ పోరులో స్వియాటెక్ ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. టైటిల్ గెలిచిన స్వియాటెక్‌కు 10,85,220 డాలర్ల (రూ. 10 కోట్ల 37 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


