సెంచరీ కొట్టిన టీమిండియా | IND vs SL 1st Test Galle Day1 Lunch Break: Rahul Padikkal Rebuild Innings | Sakshi
Sakshi News home page

సెంచరీ కొట్టిన టీమిండియా

Aug 15 2026 12:07 PM | Updated on Aug 15 2026 12:28 PM

IND vs SL 1st Test Galle Day1 Lunch Break: Rahul Padikkal Rebuild Innings

PC: BCCI X

శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా మెరుగైన ఆరంభం అందుకుంది. భోజన విరామ సమయానికి వంద పరుగుల మార్కు దాటింది. గాలె వేదికగా శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

జైసూ రనౌట్‌
ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ దూకుడుగా ఆడుతూ మంచి ఆరంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌తో సమన్వయ లోపం కారణంగా.. అనూహ్య రీతిలో రనౌట్‌ అయ్యాడు. ఇందుకు లంక బౌలర్‌ కేశారా నువాంత కూడా ఒక రకంగా కారణమే.

ఇక మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్‌.. ఐదు ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి.. తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. కేఎల్‌ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. అనంతరం.. ఆచితూచి ఆడుతున్న రాహుల్‌కు జతైన దేవదత్‌ పడిక్కల్‌ దూకుడుగానే మొదలుపెట్టాడు.

నిలకడగా..
ఈ క్రమంలో భోజన విరామ సమయానికి 27 ఓవర్లలో టీమిండియా వికెట్‌ నష్టానికి 101 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 77 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 32 పరుగులు... పడిక్కల్‌ 49 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 35 పరుగులతో క్రీజులో నిలిచారు. 

తుది జట్లు
టీమిండియా
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్‌), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

శ్రీలంక
లాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్‌), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్‌), కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.

చదవండి: సన్‌రైజర్స్‌ కొంపముంచిన క్లాసెన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement