IND vs SL: తొలి రోజు భారత్‌దే | Sri Lanka Vs India 1st Test Match Live Updates-Highlights-Galle | Sakshi
Sakshi News home page

IND vs SL: తొలి రోజు భారత్‌దే

Aug 15 2026 9:38 AM | Updated on Aug 15 2026 7:09 PM

Sri Lanka Vs India 1st Test Match Live Updates-Highlights-Galle

Photo Credit: BCCI Twitter

Sri Lanka Vs India 1st Test Live Updates: గాలే వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. క్రీజులో ప‌డిక్క‌ల్‌(131), రిష‌బ్ పంత్‌(27) ఉన్నారు.

శుబ్‌మన్‌ గిల్‌ అవుట్‌
61.5: ప్రభాత్‌ జయసూర్య బౌలింగ్‌లో లాహిరు ఉదారకు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన గిల్‌ (16). స్కోరు 236-2. పడిక్కల్‌ 107 పరుగులతో ఉన్నాడు. పంత్‌ క్రీజులోకి వచ్చాడు.

పడిక్కల్‌ సెంచరీ
టీమిండియా వన్‌డౌన్‌బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ శతక్కొట్టాడు. 134 బంతులలో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 235/1(61). పడిక్కల్‌ 106, గిల్‌ 16 పరుగులతో ఉన్నారు.

కేఎల్‌ రాహుల్‌కు గాయం
టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. సెంచరీ దిశగా దూసుకుపోతున్న కేఎల్‌ రాహుల్‌ గాయపడ్డాడు. దీంతో అతడు రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అతడిస్థానంలో కెప్టెన్‌ గిల్‌ వచ్చాడు. 

కేఎల్‌ రాహుల్‌ హాఫ్‌ సెంచరీ
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. 46 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 166/1. క్రీజులో రాహుల్‌(53), పడిక్కల్‌(78) ఉన్నారు.

పడిక్కల్‌ హాఫ్‌ సెంచరీ
దేవ్‌దత్త్‌ పడిక్కల్‌ తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 81 బంతుల్లో తన రెండో ఆర్ధ శతకాన్ని అతడు అందుకున్నాడు. 37 ఓవర్లకు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్‌తో పాటు రాహుల్‌(41) ఉన్నాడు.

తిరిగి మొదలైన ఆట
2 PM: వాన తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది.

మొదలైన జల్లులు!
12.38 PM: గాలెలో చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో గ్రౌండ్‌ సిబ్బంది వచ్చి పిచ్‌ను కవర్లతో కప్పుతున్నట్లు సమాచారం. వాన వల్ల ఆటకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.

లంచ్‌ బ్రేక్‌: టీమిండియా స్కోరు 101/1
లంకతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు లంచ్ సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. పడిక్కల్ (35), కేఎల్ రాహుల్ (32) పరుగులతో ఆడుతున్నారు. తొలి సెషన్‌లో జైస్వాల్ రనౌట్ మినహా భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. 

 

జైసూ స్థానంలోక్రీజులోకి పడిక్కల్‌
👉18 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 75 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (22), పడిక్కల్‌ (20) పరుగులతో ఆడుతున్నారు.

👉 లంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్‌తో జరిగిన సమన్వయ లోపంతో ఇ‍ద్దరు ఒకే ఎండ్‌కు రావడంతో జైస్వాల్ (32) రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

👉 8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. జైస్వాల్‌ (23), కేఎల్‌ రాహుల్‌ (10) పరుగులతో ఆడుతున్నారు.

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా శనివారం శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సర్ఫరాజ్ ఖాన్ ఆడుతాడని అంతా భావించినప్పటికీ గిల్ మాత్రం ధ్రువ్ జురెల్‌వైపే మొగ్గుచూపాడు. ఇక ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగింది.

తుది జట్లు:
టీమిండియా : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్‌), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

శ్రీలంక: లాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్‌), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్‌), కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.

1932లో తొలి టెస్టు ఆడిన టీమిండియాకు ఇది 600వ మ్యాచ్‌ కానుండగా... మైలురాయి మ్యాచ్‌లో విజయం సాధించాలని శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు టీమిండియా 9 టెస్టులు ఆడనుంది. 

ఇందులో ఏడింట గెలిస్తే భారత్‌ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించనుంది. దీంతో విజయమే లక్ష్యంగా గిల్‌ సేన బరిలోకి దిగనుంది. గౌతమ్‌ గంభీర్‌ కోచింగ్‌లో టి20 ప్రపంచకప్, ఆసియాకప్, చాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గిన టీమిండియా... సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో గంభీర్‌పై కూడా అదనపు ఒత్తిడి ఉంది.  

2017లో విరాట్‌ కోహ్లి సారథ్యంలో లంకలో పర్యటించిన భారత జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3–0తో ‘క్లీన్‌ స్వీప్‌’ చేసింది. ఆ సమయంలో టీమిండియా స్టార్‌ బ్యాటర్లతో దట్టంగా ఉండగా... ఇప్పుడు అలాంటి అనుభవజ్ఞులు కరువయ్యారు. 

 

టీమిండియా పంద్రాగష్టు సంబరాలు హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కలిసి జాతీయ జెండా ఎగురవేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement