జోరు మీదున్న ప్రజ్ఞానంద.. వైశాలి ఓటమి | R Praggnanandhaa Bounces Back-Crushes Jorden Van Foreest At Sinquefield Cup | Sakshi
Sakshi News home page

జోరు మీదున్న ప్రజ్ఞానంద.. వైశాలి ఓటమి

Aug 15 2026 7:11 AM | Updated on Aug 15 2026 7:12 AM

R Praggnanandhaa Bounces Back-Crushes Jorden Van Foreest At Sinquefield Cup

సెయింట్‌ లూయిస్‌: సింక్‌ఫీల్డ్‌ కప్‌ గ్రాండ్‌ చెస్‌ టూర్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ఖాతాలో రెండో విజయం  చేరింది. జోర్డెన్‌ వాన్‌ ఫోరీస్ట్‌ (నెదర్లాండ్స్‌)తో జరిగిన నాలుగో రౌండ్‌ గేమ్‌లో ప్రజ్ఞానంద 71 ఎత్తుల్లో గెలుపొందాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. నాలుగో రౌండ్‌ తర్వాత ప్రజ్ఞానంద 2.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. మూడు పాయింట్లతో వెస్లీ సో (అమెరికా) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

హంపి గేమ్‌ ‘డ్రా’
కెయిన్స్‌ కప్‌ అంతర్జాతీయ మహిళల చెస్‌ టోర్నీలో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి కోనేరు హంపి ఖాతాలో మూడో ‘డ్రా’ చేరింది. ప్రపంచ మాజీ చాంపియన్‌ అనా ముజీచుక్‌ (ఉక్రెయిన్‌)తో జరిగిన నాలుగో రౌండ్‌ గేమ్‌ను ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ హంపి 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. నాలుగో రౌండ్‌ తర్వాత హంపి 1.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. 

భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్‌ తొలి ‘డ్రా’ నమోదు చేసుకోగా... వైశాలి రెండో ఓటమిని చవిచూసింది. కరిస్సా యిప్‌ (అమెరికా)తో జరిగిన గేమ్‌ను దివ్య 68 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. టాన్‌ జోంగి (చైనా)తో జరిగిన గేమ్‌లో వైశాలి 40 ఎత్తుల్లో ఓడిపోయింది. దివ్య 2.5 పాయింట్లతో ఐదో స్థానంలో, ఒక పాయింట్‌తో వైశాలి తొమ్మిదో స్థానంలో ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement