చెన్నై: భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీలో తొలి పరాజయం చవిచూశాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్‌తో మంగళవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌లో అర్జున్ 60 ఎత్తుల్లో ఓడిపోయాడు. క్లాసికల్ ఫార్మాట్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌కు మూడో ఓటమి ఎదురైంది. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ప్రాణేశ్ 39 ఎత్తుల్లో గుకేశ్‌ను ఓడించాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీ నేడు ముగుస్తుంది.
ఆరో రౌండ్ తర్వాత అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 3.5 పాయింట్లతో అర్జున్, నొదిర్‌బెక్ అబ్దుసత్తోరోవ్ (ఉజ్బెకిస్తాన్) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. 1.5 పాయింట్లతో గుకేశ్ చివరిదైన ఎనిమిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. నేడు జరిగే చివరిదైన ఏడో రౌండ్‌లో అలీరెజా ఫిరూజాతో అర్జున్; నిహాల్ సరీన్‌తో ప్రాణేశ్; నీమెన్ (అమెరికా)తో గుకేశ్; నొదిర్‌బెక్‌తో ఆంద్రెకిన్ (రష్యా) తలపడతారు. టైటిల్ రేసులో అర్జున్, అలీరెజా, నొదిర్‌బెక్ ఉన్నారు.


