మూడో స్థానంతో ముగించిన అర్జున్‌ | Arjun finishes third in Chennai Grand Masters Chess Tournament | Sakshi
Sakshi News home page

మూడో స్థానంతో ముగించిన అర్జున్‌

Jul 23 2026 3:31 AM | Updated on Jul 23 2026 3:31 AM

Arjun finishes third in Chennai Grand Masters Chess Tournament

చెన్నై: క్వాంట్‌బాక్స్‌ చెన్నై గ్రాండ్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో తెలంగాణ ఆటగాడు అర్జున్‌ ఇరిగేశికి మూడో స్థానం దక్కింది.  అలీరెజా ఫిరోజ (ఫ్రాన్స్‌)తో జరిగిన చివరి (7వ) రౌండ్‌ గేమ్‌ను అర్జున్‌ ‘డ్రా’గా ముగించాడు. 8 మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఓవరాల్‌గా 2 విజయాలు, 5 డ్రాలతో 4.5 పాయింట్లు సాధించిన అలీరెజా చాంపియన్‌గా నిలిచాడు. 2 విజయాలు 4 డ్రాలు, ఒక ఓటమితో అర్జున్‌ (4 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాడు.  దిమిత్రీ ఆండ్రీకిన్‌ (రష్యా – 4 పాయింట్లు)కు రెండో స్థానం లభించింది. ఇతర భారత ఆటగాళ్లు ప్రాణేశ్‌ (5వ), నిహాల్‌ సరీన్‌ (6వ), వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌ దొమ్మరాజు (8వ)తో నిరాశపర్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement