breaking news
Divya Deshmukh
-
విజేతకు.. విజయమూ ప్రత్యర్థే!
చిన్న గెలుపు కూడా పెద్ద సంతోషాన్నిస్తుంది. అదే పెద్ద గెలుపైతే! అదికూడా – ప్రపంచాన్నే జయించినంత గొప్ప గెలుపైతే! లోకం మొత్తం ఏకమై జయజయధ్వానాలు చేస్తుంది. పూల వర్షం కురిపిస్తుంది. విజేతను కీర్తి సింహాసనంపై కూర్చోబెడుతుంది. చిన్న వయసులోనే జగదేక వీరులైన వారినైతే ముద్దు చేస్తుంది. మురిపాలు కురిపిస్తుంది. వరాలు, వరహాలు కుమ్మరిస్తుంది. విశ్వనాథన్ ఆనంద్, సచిన్ టెండూల్కర్, సానియా మీర్జా, పీవీ సింధు (PV Sindhu).. ఇలా ఒక్క స్పోర్ట్స్‌లోనే కాదు, ప్రపంచ పోటీలు జరిగే ప్రతి రంగంలోనూ దివి నుంచి భువికి దిగినట్లుగా విజేతలపై ఒక్కసారిగా మహోజ్వలమైన వెలుగు ప్రసరిస్తుంది. మరి అంతటి వెలుగును తట్టుకోవటం అందరికీ చేతనవుతుందా? చిన్న వయసులోనే స్టార్డమ్ సంపాదించినవారికి అసలే సాధ్యమవుతుందా?భారతదేశ చదరంగ వినీలాకాశంలో సరికొత్త ధ్రువతార 19 ఏళ్ల దివ్యా దేశ్‌ముఖ్ (Divya Deshmukh) ప్రస్తుతం ఒక అపరిచిత ప్రత్యర్థితో రేయింబవళ్లూ తలపడుతూ ఉంది! ఆ ప్రత్యర్థి పేరు ‘గెలుపు!’ జార్జియాలోని బాటుమిలో జరిగిన ఫిడె మహిళల ప్రపంచ కప్ విజేతగా నిలిచిన దివ్య, ఆ గెలుపును తట్టుకుని నిలబడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంది. ఆలోచించి మరీ ‘ఆనందాల పావులను’ కదుపుతోంది. వినేందుకు ఇది విచిత్రంగా ఉండొచ్చు. కానీ, ఓటమిని తట్టుకోవటం ఎంత కష్టమో, గెలుపును తడబడకుండా పట్టుకుని నిలబడటమూ అంతే కష్టం.ఉక్కిరి బిక్కిరిఫిడే ప్రపంచ కప్పును, గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను సాధించిన తర్వాత నాగ్‌పూర్‌కు తిరిగి వచ్చిన ఈ టీనేజర్‌కు భారీ స్వాగతం లభించింది. ‘జన ఘన సందోహం’ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిజానికి, బాటుమిలో ‘ట్రోఫీ’ చేతికి అందిన క్షణం నుంచే గెలుపుతో దివ్యా దేశ్‌ముఖ్ ‘సమస్యలు’ మొదలయ్యాయి! తొలి సమస్య... ఇన్‌స్టాగ్రామ్‌లో తన ట్రోఫీతో ఎలా ఫోజు ఇవ్వాలి అన్నదే! ఇంటర్వ్యూలుఅర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ (Lionel Messi) వరల్డ్ కప్ ట్రోఫీని హత్తుకుని పడుకున్న ఫొటోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 కోట్ల లైక్‌లు రావటం దివ్యకు గుర్తుంది. ‘నేను కూడా అలాగే చేయాలనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తూ, అలసటతో నిద్రపట్టేసింది’ అని దివ్య ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, నవ్వేసింది. గెలుపు అలసటను మాత్రమే కాదు, ఇంటర్వ్యూలను కూడా తీసుకొస్తుంది. టీనేజ్ జగజ్జేతలకు ఈ సంతోషాన్ని తట్టుకోవటం కాస్త కష్టమైన వ్యవహారమే.ప్రముఖుల సందేశాలు‘విజేత’ అనే టైటిల్ దివ్యకు మరో పరీక్ష పెట్టింది! ఆమె విజయంలో పాలు పంచుకోవాలని యావద్దేశం ఉవ్విళ్లూరింది. ‘మనమ్మాయి’ అని ఉప్పొంగింది. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఆమెకు వీడియో కాల్ చేశారు. అంతటి మహామహులు తనకు ఫోన్ చేసి, స్క్రీన్‌పై తన కళ్ల ముందు ప్రత్యక్షమై అభినందనలు తెలుపుతుంటే ఏడు గుర్రాలపై విజయ విహారం చేయటమే. అక్కడితో అయిపోలేదు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి దేశ రాజధానికి దివ్యను ఆహ్వానించారు. ఇక ఆమె ఫోన్‌కు వస్తున్న సందేశాలకైతే లెక్కేలేదు. ఆ వరదలో దివ్య మునకలేస్తోంది. అంతమందికి ఒక్కొక్కరిగా కృతజ్ఞతలు ఎప్పటికి చెప్పగలను అని సతమతం అవుతోంది. అంతేనా, నాగపూర్‌లో మహా పట్టాభిషేకం, వరుసగా సన్మానాలు, ఇంటికి వచ్చి వెళుతున్న శ్రేయోభిలాషులు!చిన్నారులకు ఆదర్శంటైటిల్ గెలుచుకుని నాగ్‌పూర్‌లో అడుగుపెట్టినప్పుడు, అంతమంది జనాన్ని, ముఖ్యంగా పిల్లలను చూడటంతో దివ్య తబ్బిబ్బయింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ఆమెను సత్కరించే కార్యక్రమంలో కనీసం 50 శాతం మంది పిల్లలే ఉన్నారు. ఆ చిన్నారుల్లో ఒక చిన్నారిగా దివ్య కలిసిపోయింది. అక్కడి కేరింతలకు ఆమెకు కన్నీళ్లొచ్చినంత పనైంది. అయినా హుందాగానే ఆ పరిస్థితిని ఎదుర్కొంది.విజయాన్ని తట్టుకోవటానికి 5 మెట్లు!1. ఒక్కసారిగా వచ్చిన కీర్తి దిక్కుతోచని స్థితిలో పడేస్తుంది. చిన్నపిల్లలు, టీనేజర్లకైతే అంతా అయోమయంగా ఉంటుంది. ఇలాంటప్పుడు మొదటి అడుగుగా మౌనం, చిరునవ్వే వారిని గట్టెక్కిస్తాయి.2. విజయోత్సాహం దినచర్యలను క్రమరహితం చేసే అవకాశం ఉంది. అలా జరక్కుండా ఎప్పటిలా ఆహారం, వ్యాయామం, నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి.3. ప్రతి ప్రశంసకూ, మీడియా సంధించే ప్రశ్నలకు స్పందించే క్రమంలో తీవ్రమైన ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులే తమ చిన్నారి విజేతకు సహాయంగా ఉండి, వారి ఒత్తిడిని తగ్గించేలా చూడాలి.4. విజేతలు కొన్నిసార్లు తమ వస్త్రధారణ, శరీరాకృతి విషయమై సోషల్ మీడియాలో విమర్శలకు గురికావచ్చు. వాటిని తేలిగ్గా తీసుకోవాలి. మాటకు మాట చేటు తెస్తుంది.5. గెలుపు గుర్తింపునే కాదు, గుర్తించలేని శత్రువులను కూడా వెంట తీసుకొస్తుంది. కొందరు మాట్లాడటం మానేస్తారు. కొందరు చాటుగా ఏదో అంటున్నారని తెలుస్తుంది. వాళ్ల నుంచి చిన్నారి విజేతల్ని వారి కోచ్‌లు, పేరెంట్స్ కాపు కాచుకోవాలి.అంత సులభం కాదుఆట అనే కాదు.. ఒక పాటల కార్యక్రమం, డ్యాన్స్ ప్రోగ్రామ్.. ఇలా రాష్ట్ర లేదా జాతీయ స్థాయి కార్యక్రమంలో విజేతలుగా రాణిస్తున్న చిన్నారులు మన కళ్ల ముందే ఎంతోమంది ఉన్నారు. ఆ చిన్న మనసులకు ఆ గెలుపు ఎంతో కిక్కునిస్తుంది. ఆ తరువాత వచ్చే ప్రశంసలు, జరిగే సన్మానాలు వారిని మునగచెట్టు ఎక్కిస్తాయి. అక్కడే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. చిన్నపిల్లలు వాళ్లకేం తెలుసు, అంత ఎత్తునుంచి జారిపడే ప్రమాదం ఉందని, పడితే నడుం విరుగుతుందని! చదవండి: రెప్పల లోపల ఇసుకను భరించని కళ్లు లేవుగెలుపు రుచి చూసిన తమ పిల్లలను కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఆ మత్తు వారి తలకెక్కకుండా.. చదువు పక్కదారి పట్టకుండా.. స్నేహితులను దూరం చేసుకోకుండా చూసుకోవాలి. నిజానికి దివ్య వ్యవహరించిన శైలి ఎంతోమందికి ఆదర్శం. సచిన్, విశ్వనాథన్ ఆనంద్ లాంటి మహామహులు.. దివ్య ఇప్పుడున్న దశను దాటిన తరువాత వ్యవహరించిన తీరు దివ్యకు ఆదర్శం కావాలి. - సాక్షి, స్పెషల్ డెస్క్ -
దివ్యకు రూ. 3 కోట్ల నజరానా
నాగ్‌పూర్: మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రూ. 3 కోట్ల నగదు బహుమతిని అందించారు. జార్జియాలో ఇటీవల జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో భారత స్టార్ కోనేరు హంపిపై ‘టైబ్రేక్’లో నెగ్గి చాంపియన్‌గా అవతరించిన 19 ఏళ్ల దివ్యను శనివారం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో ఫడ్నవీస్ ప్రత్యేకంగా అభినందించారు. నాగ్‌పూర్‌కు చెందిన దివ్య యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఫడ్నవీస్ అన్నారు. చిన్న వయసులోనే పెద్ద ఘనత సాధించిన దివ్యను సత్కరించడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ... ‘ఇది నాకు ప్రత్యేకమైన సందర్భం. చిన్నారులకు స్ఫూర్తిగా నిలవడంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని వెల్లడించింది. ఇదే కార్యక్రమంలో మహారాష్ట్ర చెస్ సంఘం దివ్యకు రూ. 11 లక్షల నజరానా అందించింది. ఒక్క జీఎం నార్మ్ కూడా లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన దివ్య... టైటిల్‌తో పాటు నేరుగా గ్రాండ్‌మాస్టర్ హోదా సైతం దక్కించుకుంది. మరోవైపు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ గవాయ్ శనివారం దివ్య దేశ్‌ముఖ్ ఇంటిని సందర్శించి... వరల్డ్‌కప్ టైటిల్ గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దివ్య కుటుంబంతో తనకున్న అనుంబంధాన్ని గుర్తుచేసుకున్న చీఫ్ జస్టిస్... భవిష్యత్తులో దివ్య మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
గురువును గుర్తు చేసుకుంటూ..
నాగ్‌పూర్: దివ్య దేశ్‌ముఖ్... ప్రస్తుత చెస్ సంచలనం. 19 ఏళ్ల వయసులో మహిళల ప్రపంచకప్‌ను గెలుచుకొని సత్తా చాటిన ఘనాపాటీ. జార్జియాలో జరిగిన ఫైనల్లో కోనేరు హంపిని ఓడించిన అనంతరం చాంపియన్‌గా నిలిచిన అనంతరం దివ్య బుధవారం రాత్రి స్వదేశానికి తిరిగి వచ్చింది. సొంత ఊరు నాగ్‌పూర్ విమానాశ్రయంలో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులతో అంతా సందడిగా ఉంది. దివ్య రాగానే వారంతా బాజా భజంత్రీలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అప్పుడే దివ్య తన వద్ద ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్‌ను బయటకు తీసి ప్రదర్శించింది. అది ఆమె మొదటి కోచ్ రాహుల్ జోషి చిత్రం. దానిని చూపిస్తూ దివ్య భావోద్వేగానికి లోనైంది. చెస్‌లో రాహుల్ వద్దే దివ్య ఓనమాలు నేర్చుకుంది. కేవలం కోచ్‌గానే కాకుండా తన సొంత ఇంట్లో మనిషిగా చూస్తూ రాహుల్ ఆమెకు శిక్షణనందించాడు. కెరీర్ ఆరంభంలో అండర్–9 స్థాయి నుంచి అండర్–14 వరకు పలు విజయాలు రాహుల్ కోచ్‌గా ఉండగానే వచ్చాయి.ఆమె మరింత ఎదుగుతున్న దశలో 2020లో కరోనా మహమ్మారి వచి్చంది. దీనికి 40 ఏళ్ల వయసులోనే జోషి బలయ్యాడు. కొన్ని విజయాలు సాధించగానే గతాన్ని మరిచిపోయే క్రీడాకారులు మనకు ఎంతో మంది కనిపిస్తుంటారు. కానీ ఆదిగురువును ఆమెకు గౌరవించిన తీరు దివ్యను ప్రత్యేకంగా చూపించింది. ‘నేను ఈ స్థాయికి చేరడంతో మొదటి కోచ్ రాహుల్ జోషి సర్ పాత్ర ఎంతో ఉంది. నేను గ్రాండ్‌మాస్టర్ కావాలని ఆయన ఎంతో కోరుకునేవారు. ఈ విజయం ఆయనకే అంకితం’ అని దివ్య తన మనసులో భావాన్ని వెల్లడించింది. నా ఆటపైనే దృష్టి పెట్టాను... హంపితో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తనపై ఎలాంటి ఒత్తిడీ లేదని, తాను ఓడినా కోల్పోయేదేమీ లేదనే ఆలోచనతోనే బరిలోకి దిగినట్లు దివ్య పేర్కొంది. ప్రత్యర్థికి ఎంతో అనుభవం ఉన్నా... దాని గురించి ఆందోళన చెందకుండా తన ఆటపైనే దృష్టి పెట్టానని ఆమె వెల్లడించింది. ‘నేను ఓడిపోతాననే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. నిజానికి హంపి చేసిన పెద్ద తప్పుతోనే విజయం నా సొంతమైంది. నేను వేయబోయే ఎత్తుల గురించే తప్ప తుది ఫలితం ఎలా వస్తుందని పట్టించుకోలేదు. కాబట్టి ఒత్తిడికి లోను కాలేదు.అంతర్జాతీయ చెస్‌లో భారత మహిళలు సాధించే విజయాలు ఇక్కడ మరింత మంది అమ్మాయిలు ఈ ఆట వైపు ఆకర్షితులయ్యేందుకు స్ఫూర్తినిస్తాయి. అయితే నా ఉద్దేశం ప్రకారం తల్లిదండ్రుల మద్దతే అన్నింటికంటే అవసరం. ముఖ్యంగా విజయాలు సాధించినప్పుడు కాకుండా ఓటములు ఎదురైనప్పుడు కూడా అండగా నిలవాల్సి ఉంటుంది’ అని దివ్య అభిప్రాయ పడింది. సెప్టెంబర్ లో తర్వాతి టోర్నీ... ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో తనకు దక్కిన కొత్త గుర్తింపు పట్ల దివ్య దేశ్‌ముఖ్ సంతోషం వ్యక్తం చేసింది. మున్ముందు ఇలాంటి విజయాలను కొనసాగిస్తానని ఆమె ఆత్మవిశ్వాసంతో చెప్పింది. స్వస్థలం నాగపూర్‌లో లభించిన ఘన స్వాగతాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని దివ్య పేర్కొంది. ‘నా కోసం ఇంత మంది ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వారంతా నన్ను సన్మానించిన తీరు చూస్తే గర్వంగా అనిపిస్తోంది. నాతో పాటు చెస్‌కు లభించిన గుర్తింపుగా దీనిని భావిస్తున్నాను. తల్లిదండ్రులు నాకు అండగా నిలిచి ప్రోత్సహించడంతోనే ఇది సాధ్యమైంది. నా విజయంలో వారి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ బరిలోకి దిగుతాను. సెపె్టంబర్ 2 నుంచి ఉజ్బెకిస్తాన్‌లో జరిగే గ్రాండ్ స్విస్ నా తర్వాతి టోర్నీ కానుంది’ అని దివ్య వెల్లడించింది. తాను వరల్డ్ కప్ గెలుచుకోవడంలో సహకరించిన మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు అభిజిత్ కుంతే, అభిమన్యు పురాణిక్, సబా బలోగ్ (హంగేరీ)లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. -
ఎంత గ్రాండ్‌మాస్టర్ అయినా తల్లి చాటు బిడ్డే..!
చెస్ గురించి పెద్దగా ఆసక్తి లేని వారికి కూడా ఇప్పుడు సుపరిచిత పేరు... దివ్యా దేశ్‌ముఖ్. ప్రపంచం మెచ్చిన అపూర్వ విజయం తరువాత తన తల్లిని కౌగిలించుకొని భావోద్వేగానికి గురువుతున్న దివ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘తల్లి అంటే ఎంతోమంది స్టార్ల వెనుక ఉన్న అన్సంగ్ హీరో’ అని దివ్య తల్లి గురించి ప్రశంసిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర. ‘ఎంత గ్రాండ్‌మాస్టర్ అయినా తల్లి చాటు బిడ్డే’ అన్నారు నెటిజనులు. తల్లులు పిల్లల గురించి ఎన్నో కలలు కంటారు. వారి కలలను తమ కలలుగా భావిస్తారు. వారి కష్టాలను తమ కష్టాలుగా భావిస్తారు. పిల్లల కంటే ఎక్కువగా వారి విజయాలకు సంతోషంతో ఉప్పొంగిపోతారు. అందుకే...అమ్మలు అన్సంగ్ హీరోలు. ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ గెలుచుకున్న తరువాత ‘ఎవరీ దివ్య దేశ్‌ముఖ్?’ అనే ఆసక్తి చాలామందిలో మొదలైంది. చాలా చిన్న వయసు నుంచే చెస్ ఆడడం మొదలుపెట్టిన దివ్య చెస్‌లోనే కాదు చదువులోనూ ‘శభాష్’ అనిపించుకునేది. ‘అయిదేళ్ల వయసు నుంచే చెస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది దివ్య. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెలుచుకున్న దివ్యకు కామ్గర్ల్గా పేరు. జయాపజయాలలో ఒకేరకంగా ఉండడం కొందరికి మాత్రమే సాధ్యపడుతుంది. అలాంటి వారిలో దివ్య ఒకరు. ఓడిపోయిన సందర్భంలోనూ ఆమె కళ్లలో బాధ కనిపించేది కాదు. టోర్నమెంట్ గెలచినప్పుడు ట్రోఫీతో నా దగ్గరకు వచ్చేది. తాను సాధించిన విజయం గురించి ఎంతోమాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ చాలా తక్కువగా మాట్లాడేది. తనకు ఇష్టమైన ఆట, చదువును రెండిటినీ విజయవంతంగా సమన్వయం చేసుకునేది. నాగ్‌పూర్ కాకుండా వేరే చోట చెస్ పోటీలు జరిగినప్పుడు పాఠ్యపుస్తకాలను తీసుకువెళ్లేది. చదువును ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు’ అంటూ గత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది నాగ్‌పూర్‌లోని భారతీయ విద్యాభవన్ స్కూల్ మాజీ ప్రిన్సిపాల్ అంజు భూటాని.Divya’s hug to her mom says everything ❤️#FIDEWorldCup @DivyaDeshmukh05 pic.twitter.com/jeOa6CjNc1— International Chess Federation (@FIDE_chess) July 28, 2025 (చదవండి: రికార్డు బ్రేకింగ్ నాట్య ప్రదర్శన..! ఏకంగా 170 గంటల పాటు..) -
‘మానసిక దృఢత్వమే గెలిపించింది’
న్యూఢిల్లీ: మహిళా చెస్ దిగ్గజం సుసాన్ పోల్గర్ భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్‌పై ప్రశంసలు కురిపించింది. వరల్డ్ కప్‌లో వేర్వేరు సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దివ్య గెలిచిన తీరు అద్భుతమని ఆమె వ్యాఖ్యానించింది. మానసిక దృఢత్వం, పోరాటతత్వమే ఆమెను చాంపియన్‌గా నిలిపిందని పోల్గర్ అభిప్రాయపడింది. ‘చారిత్రక విజయం సాధించిన దివ్యకు నా అభినందనలు. చాలా బాగా ఆడింది. టోర్నీకి ముందు ఫేవరెట్లలో ఆమె పేరు లేదు. అయితే గెలవాలనే పట్టుదల, మానసిక దృఢత్వంతో ఆమె ముందంజ వేయగలిగింది. టోర్నీలో దివ్య ఇబ్బంది పడిన గేమ్‌లు ఉన్నాయి. మంచి అవకాశాలు వచ్చినా వాటిని వృథా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాటి ప్రభావం ఆమెపై పడలేదు. ఎలాంటి ఆందోళన లేకుండా ఆమె పోరాడింది. అదే పట్టుదల చివరి వరకు నిలిచి గెలిచేలా చేశాయి’ అని పోల్గర్ వ్యాఖ్యానించింది. ప్రపంచ చెస్‌లో ఇటీవలి కాలంలో భారత ఆటగాళ్లు సాధించిన విజయాలు అపూర్వమని ఆమె పేర్కొంది. వీరందరికీ గొప్ప భవిష్యత్తు ముందుందని పోల్గర్ జోస్యం చెప్పింది. ‘గుకేశ్ పెద్ద స్థాయికి చేరతాడని అతనికి 12 ఏళ్లు ఉన్నప్పుడే నేను చెబితే ఎవరూ నమ్మలేదు. 50 మంది గ్రాండ్మాస్టర్లను తయారు చేసిన నా అనుభవంతో ఆ వ్యాఖ్యలు చేశాను. దివ్య విషయంలో కూడా అదే జరిగింది. పెద్ద ప్లేయర్‌గా గుర్తింపు లేకపోయినా ఆమెలో ప్రత్యేక ప్రతిభ ఉంది కాబట్టే ఈ స్థాయిలో గెలిచింది. ప్రస్తుతం భారత చెస్‌లో స్వర్ణయుగం నడుస్తోంది. వారి ఆట గొప్పగా ఉండటంతో పాటు సరైన రీతిలో మద్దతు, దిశానిర్దేశం లభిస్తున్నాయి. దివ్య ఇక్కడితో ఆగిపోవద్దు. ఆమె ఆటపై అందరి దృష్టీ ఉంటుంది కాబట్టి మరింతగా కష్టపడి లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. హంపి అంటే కూడా నాకు గౌరవం ఉంది. సుదీర్ఘ కాలం ఆమె అగ్రస్థాయిలో కొనసాగింది. అయితే వయసు పెరుగుతున్నకొద్దీ పరిస్థితులు కొంత ప్రతికూలంగా మారడం సహజం’ అని పోల్గర్ పేర్కొంది. -
భారత మహిళా చెస్‌లో ‘దివ్య’ చరితం (ఫొటోలు)
-
Divya Deshmukh: అసలైన హీరో మాత్రం ఆమెనే: ఆనంద్ మహీంద్ర
దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh).. భారత చెస్ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మారుమ్రోగి పోతోంది. చదరంగ దిగ్గజాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (Dronavalli Harika)లకు కూడా సాధ్యం కాని అరుదైన ఘనతను దివ్య సాధించడమే ఇందుకు కారణం. ఫిడే మహిళల ప్రపంచకప్ (FIDE Women's World Cup) ఫైనల్లో ఏకంగా హంపినే ఓడించిన దివ్య.. ఈ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది.దూకుడు ప్రదర్శిస్తూనేపందొమిదేళ్ల వయసులోనే ఈ మహారాష్ట్ర అమ్మాయి ఈ అరుదైన రికార్డు సాధించడం మరో విశేషం. దూకుడుగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే.. కీలక సమయాల్లో ఒత్తిడి దరిచేరనీయకుండా ప్రశాంతంగా ఉండటం దివ్యలోని అరుదైన లక్షణం. ప్రత్యర్థి ఎంతటివారైనా ఏమాత్రం తడబాటుకు లోనుకాకుండా తన పనిని పూర్తి చేయడంలో ఆమె దిట్ట.అందుకే భారత చదరంగ మహారాణిగా వెలుగొందుతున్న 38 ఏళ్ల హంపిని కూడా.. ఇంత చిన్నవయసులోనే దివ్య ఓడించగలిగింది. క్లాసిక్ గేమ్స్‌ను డ్రా చేసుకున్న దివ్య.. ర్యాపిడ్ రౌండ్స్‌లో మాత్రం చక్కటి ప్రదర్శనతో ఆద్యంతం సానుకూల దృక్పథంతో ముందుకు సాగి చాంపియన్‌గా అవతరించింది.అసలైన ‘హీరో’కు కూడా క్రెడిట్ఈ నేపథ్యంలో దివ్య దేశ్‌ముఖ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తదితరులు దివ్యను కొనియాడగా.. తాజాగా వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ జాబితాలో చేరారు. అయితే, ఆయన దివ్యను ప్రశంసిస్తూనే ఆమె వెనుక ఉన్న అసలైన ‘హీరో’కు కూడా క్రెడిట్ ఇవ్వడం విశేషం.ఈ మేరకు.. ‘‘ఫిడే ప్రపంచకప్-2025 విజేత దివ్య దేశ్‌ముఖ్. ఈ విజయంతో ఆమె గ్రాండ్ మాస్టర్ హోదాను కూడా పొందింది. పందొమిదేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించింది.అయినా, ప్రతీ గ్రాండ్ మాస్టర్ వెనుక ఓ తల్లి ఉంటుంది. ఎంతో మంది ఇలాంటి స్టార్ల వెనుక అన్సంగ్ హీరోగా నిలబడిపోతుంది’’ అంటూ దివ్య దేశ్‌ముఖ్ తన తల్లి నమ్రతను ఆలింగనం చేసుకున్న వీడియోను ఆనంద్ మహీంద్ర పంచుకున్నారు.ఇక ఆయన వ్యాఖ్యలతో నెటిజన్లు కూడా ఏకీభవిస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నై చెస్ స్టార్లు ఆర్.ప్రజ్ఞానంద, ఆర్.వైశాలిల తల్లి నాగలక్ష్మిని గుర్తుచేస్తూ అమ్మలకు సెల్యూట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.దివ్య భావోద్వేగంప్రపంచకప్ గెలవగానే దివ్య తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘ఈ విజయానుభూతిని ఆస్వాదిస్తున్నాను. దీని నుంచి తేరుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుంది. ఇక్కడికి వచ్చే ముందు నాకు ఒక్క జీఎం నార్మ్ కూడా లేదు.నేను ఎప్పుడు నార్మ్ సాధిస్తానో అని ఆలోచించేదాన్ని. కానీ ఇక్కడ ఇలా గ్రాండ్‌మాస్టర్ కావాలని నాకు రాసి పెట్టి ఉంది. నాకు ఈ ఆనందంలో మాటలు రావడం లేదు. ఈ విజయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నా దృష్టిలో ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఇంకా ఇలాంటివి చాలా సాధించాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొంది. ఇక ఫైనల్ గెలవగానే తల్లి నమ్రతను హత్తుకుని దివ్య ఆనందభాష్పాలు రాల్చింది. ఆ తల్లి కూడా విజయగర్వంతో ఉప్పొంగిపోయింది. కాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన దివ్య దేశ్‌ముఖ్ తల్లిదండ్రులు నమ్రత, జితేంద్ర దేశ్‌ముఖ్. వీరిద్దరూ డాక్టర్లే!చదవండి: ‘కోహ్లిపై వేటుకు సిద్ధమైన ఆర్సీబీ.. అతడి స్థానంలో మాజీ క్రికెటర్’ Divya Deshmukh, the Winner of the 2025 FIDE Women’s World Cup.Through this victory she also achieves Grandmaster status. At the age of 19. And behind the Grandmaster is the caring mother…As always, the unsung hero behind many stars…pic.twitter.com/9AyeBBPbM5— anand mahindra (@anandmahindra) July 28, 2025 -
దివ్యమైన విజయం
అంతర్జాతీయ చదరంగ వేదికపై మరోసారి భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్ నుంచి దివ్య దేశ్‌ముఖ్ రూపంలో తొలిసారి చాంపియన్ ఆవిర్భవించింది. తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న క్రీడాకారిణులు బరిలో ఉండటం... ఫేవరెట్ ముద్ర లేకపోవడం... 19 ఏళ్ల ఈ మహారాష్ట్ర అమ్మాయికి కలిసొచ్చింది. ఫలితంగా... ఆరంభం నుంచి స్వేచ్ఛగా ఆడుతూ... అందరి అంచనాలను తారుమారు చేస్తూ... మేధో క్రీడలో ఏకాగ్రతతో ఆడితే... పక్కా ప్రణాళికతో చకచకా ఎత్తులు వేస్తే... ప్రత్యర్థి ఎంతటి మేధావి అయినా... ఒకానొక దశలో ఒత్తిడికి గురై అనవసర తప్పిదాలు చేస్తారని.... చివరకు చేతులెత్తేస్తారని... దివ్య తన అద్భుతమైన ఆటతీరుతో నిరూపించింది. వెరసి తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకే గెలుపుతో... దివ్య స్వర్ణ పతకాన్ని దక్కించుకోవడంతోపాటు...మరోవైపు ఊహ కందని విధంగా గ్రాండ్‌మాస్టర్ (జీఎం) టైటిల్ హోదాను కూడా ఖాయం చేసుకోవడం విశేషం. బతూమి (జార్జియా): అనుభవంపై యువతరం గెలిచింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీలో భారత్‌కు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం), 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ విజేతగా అవతరించింది. రెండు సార్లు ర్యాపిడ్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత మహిళా దిగ్గజ చెస్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, 38 ఏళ్ల కోనేరు హంపితో జరిగిన ఫైనల్లో దివ్య దేశ్‌ముఖ్ ఓవరాల్‌గా 2.5–1.5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం క్లాసికల్ ఫార్మాట్లో నిరీ్ణత రెండు గేమ్‌లు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ నిర్వహించారు. ర్యాపిడ్ ఫార్మాట్లో 15 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లు జరిగాయి. తొలి గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన దివ్య 81 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. దాంతో టైబ్రేక్‌లో తొలి గేమ్ ముగిశాక ఇద్దరూ 0.5–0.5తో సమంగా నిలిచారు. రెండో గేమ్‌ను హంపి తెల్ల పావులతో ప్రారంభించింది. ఒకానొక దశలో ఈ గేమ్ కూడా ‘డ్రా’గా ముగిసేలా అనిపించింది. చాంపియన్‌ను నిర్ధారించేందుకు మరో రెండు ర్యాపిడ్ గేమ్‌లు అవసరం పడతాయనిపించింది. అయితే సమయాభావం వల్ల కీలక దశలో హంపి ఒత్తిడికిలోనై పొరపాట్లు చేయడం... వాటిని దివ్య సది్వనియోగం చేసుకుంది. ఫలితంగా రెండో గేమ్‌లో దివ్య 75 ఎత్తుల్లో గెలుపొంది 1.5–0.5తో విజయాన్ని ఖాయం చేసుకుంది. టైబ్రేక్‌లో తొలి రెండు ర్యాపిడ్ గేముల్లోనే విజేత తేలిపోవడంతో తదుపరి గేమ్‌లు నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ఈ గెలుపుతో ప్రస్తుతం అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) టైటిల్‌తో ఉన్న దివ్యకు గ్రాండ్‌మాస్టర్ (జీఎం) టైటిల్ ఖాయమైంది. విజేత దివ్య దేశ్‌ముఖ్‌కు స్వర్ణ పతకంతోపాటు 50 వేల డాలర్లు (రూ. 43 లక్షల 38 వేలు)... రన్నరప్ హంపికి రజత పతకంతోపాటు 35 వేల డాలర్లు (రూ. 30 లక్షల 36 వేలు)... మూడో స్థానం పొందిన చైనా గ్రాండ్‌మాస్టర్ టాన్ జోంగికి కాంస్య పతకంతోపాటు 25 వేల డాలర్లు (రూ. 21 లక్షల 68 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గాలివాటమేమీ కాదు... 46 దేశాల నుంచి మొత్తం 107 మంది ప్లేయర్లు పోటీపడ్డ ఈ ప్రపంచకప్ నాకౌట్ టోర్నీలో 2463 రేటింగ్ పాయింట్లు ఉన్న దివ్య 15వ సీడింగ్‌తో బరిలోకి దిగింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఈ నాగ్‌పూర్ అమ్మాయి టైటిల్ గెలిచే క్రమంలో తన కంటే ఎంతో మెరుగైన రేటింగ్ పాయింట్లు, గ్రాండ్‌మాస్టర్ హోదా ఉన్న నలుగురు ప్లేయర్లను ఓడించి ఈ విజయం గాలివాటమేమీ కాదని నిరూపించుకుంది. ఫైనల్లో హంపి (2543 రేటింగ్ పాయింట్లు), సెమీఫైనల్లో టాన్ జోంగి (చైనా; 2546), క్వార్టర్ ఫైనల్లో ద్రోణవల్లి హారిక (భారత్; 2483), ప్రిక్వార్టర్ ఫైనల్లో జు జినెర్ (చైనా; 2547 రేటింగ్)లపై దివ్య గెలిచింది. దివ్య 2005లో జన్మించగా... హంపి 2002లోనే గ్రాండ్‌మాస్టర్ హోదా పొందింది. ఇప్పటికి రెండుసార్లు హంపి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ (2019లో, 2024లో) నిలిచింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో హంపినే ఫేవరెట్ అనుకున్నారంతా... కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అద్భుత విజయంతో ‘దివ్య’మైన చెస్ ప్రపంచాన్ని సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన వెంటనే దివ్య తన భావోద్వేగాన్ని తల్లితో పంచుకుంది. డాక్టర్ల ఫ్యామిలీ నుంచి... దివ్య తల్లిదండ్రులు నమ్రత, జితేంద్ర దేశ్ముఖ్లిద్దరూ డాక్టర్లు. 2005 డిసెంబర్ 5న నాగ్‌పూర్‌లో జన్మించిన దివ్య ఐదేళ్ల ప్రాయంలో చెస్‌లో అడుగు పెట్టింది. దివ్య సోదరి బ్యాడ్మింటన్ శిక్షణకు వెళుతున్న సమయంలో అక్కడే జరుగుతున్న చెస్ శిబిరంలో దివ్య చేరింది. ఆ తర్వాత చెస్‌పై మక్కువ ఏర్పడటంతో ఆటను సీరియస్‌గా తీసుకుంది. 2020లో ఆన్లైన్లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న దివ్య 2021లో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా పొందింది. ఆ తర్వాత 2022లో జాతీయ చాంపియన్‌గా నిలిచింది. 2022 చెస్ ఒలింపియాడ్‌లో వ్యక్తిగత కాంస్య పతకం... 2023లో ఆసియా చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. 2023లోనే జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో హారిక, హంపి, సవితాశ్రీ, వంతిక అగర్వాల్, ఇరీనా క్రష్లను ఓడించిన దివ్య వరల్డ్ చాంపియన్ జు వెన్జున్తో, అనా ఉషెనినాతో గేమ్‌లు ‘డ్రా’ చేసుకొని టోర్నీ విజేతగా నిలిచింది. 2024లో గాంధీ నగర్లో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నెగ్గిన దివ్య... హంగేరిలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టుకు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించింది. వ్యక్తిగత విభాగంలోనూ ఆమె బంగారు పతకాన్ని సాధించింది.ప్రస్తుత వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్ అయిన హంపి ఓటమి ఊహించలేనిది. ఎండ్గేమ్లో ఆమె వరుసగా తప్పులు చేసింది. 54వ ఎత్తులో చిన్న పొరపాటు చేసి హంపి వెనుకబడినా... ఆమెకు కోలుకునే అవకాశం కూడా వచి్చంది. అయితే సమయాభావ ఒత్తిడి ఆమెపై ప్రభావం చూపించింది. 67వ ఎత్తు వేసే సమయానికి దివ్యకు సానుకూల పరిస్థితి ఏమీ లేదు. దీనిని హంపి జాగ్రత్తగా వేసి ఉంటే గేమ్ డ్రా వైపు వెళ్లేది. కానీ ఇక్కడే హంపి మళ్లీ మరో పెద్ద తప్పు చేసింది. కొత్త తరానికి ప్రతినిధి అయిన దివ్య కొత్తగా నేర్చుకోవడంలో, దూసుకుపోవడంలో సహజంగానే కాస్త ఎక్కువ చురుకుదనాన్ని ప్రదర్శించింది. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన హంపిని ఎదుర్కొనేందుకు దివ్య పక్కాగా కొత్త ప్రణాళికలతో సిద్ధమై వచ్చినట్లు కనిపించింది. –చంద్రమౌళి, ఇంటర్నేషనల్ చెస్ ఆర్బిటర్ -
కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్‌లకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి : 2025 ఎఫ్ఐడీఈ మహిళల చెస్ ప్రపంచ కప్ భారత్ గెలుచుకోవటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఫైనల్లో తలపడిన ఇద్దరు భారతీయ మహిళలు కోనేరు హంపి, దివ్యదేశ్‌ముఖ్‌లకు అభినందనలు తెలిపారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న నాలుగవ మహిళా గ్రాండ్ మాస్టర్ దివ్య చరిత్ర సృష్టించిందంటూ ఎక్స్ వేదికగా కొనియాడారు. What an incredible all-Indian final at the FIDE Women’s Chess World Cup 2025!Heartfelt congratulations to @humpy_koneru and #DivyaDeshmukh for the epic battle.Kudos to Divya, our new World Champion and India’s fourth female Grandmaster. Truly historic! pic.twitter.com/3vMfcNlFmD— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2025 -
మహారాణి.. ఆటలోనే కాదు అందంలోనూ తనకు తానే సాటి! (ఫొటోలు)
-
ప్రపంచకప్ చాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్
ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ (FIDE World Cup) ఫైనల్లో యువ తరంగం దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh) సత్తా చాటింది. తెలుగు తేజం కోనేరు హంపి (Koneru Humpy)ని 2.5-1.5తో ఓడించి.. మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.జార్జియాలోని బతూమీ వేదికగా సోమవారం జరిగిన టై బ్రేకర్‌లో హంపీ తొలుత నల్ల పావులతో ఆడగా.. దివ్యతో కలిసి డ్రా చేసుకుంది. పదిహేను నిమిషాల పాటు సాగిన గేమ్‌లో 81 ఎత్తుల తర్వాత ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. అనంతరం పదిహేను నిమిషాల రెండో ర్యాపిడ్ మ్యాచ్‌లో 38 ఏళ్ల హంపి తెల్ల పావులతో ఆడగా.. దివ్య నల్ల పావులతో ఎత్తులు వేసింది. అయితే, ఈ టై బ్రేక్‌లో 38 ఏళ్ల హంపి చేసిన తప్పిదాల ఫలితంగా 19 ఏళ్ల దివ్య చాంపియన్‌గా అవతరించింది.ఈ గెలుపుతో దివ్య గ్రాండ్ మాస్టర్‌గా ప్రమోషన్ పొందడంతో పాటు.. క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఇక హంపిపై గెలిచిన అనంతరం దివ్య తీవ్ర భావోద్వేగానికి లోనైంది.దివ్య భావోద్వేగం‘‘ఇలా నేను గ్రాండ్ మాస్టర్ అవుతానని ఊహించలేదు. నా విధిరాతలో ఇది ఉంది. ఈ టోర్నమెంట్ ఆరంభానికి ముందు నాకు ఈ హోదా లేదు. ఈ విజయం నాకెంతో విలువైనది. ఇంకా నేను సాధించాల్సినవి చాలానే ఉన్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అంటూ దివ్య దేశ్‌ముఖ్ ఎమోషనల్ అయింది. ఈ సందర్భంగా దివ్య తల్లి ఆమెను అక్కున చేర్చుకుని.. విజయ గర్వంతో ఉప్పొంగిపోయారు. దివ్య కంటే ముందు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్.వైశాలి గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు.ట్రై బ్రేకర్ ఇలా..టైబ్రేక్‌లలో 10 నిమిషాల చొప్పున రెండు రాపిడ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ప్రతి కదలిక తర్వాత 10 సెకన్ల ఇంక్రిమెంట్ ఉంటుంది. స్కోరు సమంగా ఉంటే, ప్రతి కదలిక తర్వాత మూడు సెకన్ల ఇంక్రిమెంట్లతో రెండు, ఐదు నిమిషాల మ్యాచ్‌లు ఆడతారు. టై కొనసాగితే, ప్రతి కదలిక తర్వాత రెండు సెకన్ల ఇంక్రిమెంట్లతో మూడు నిమిషాల చొప్పున రెండు బ్లిట్జ్ మ్యాచ్‌లు ఆడాలి. Divya Deshmukh 🇮🇳 winner of the World Chess Cup and also now a Grandmaster!pic.twitter.com/UNmgiq33qq— Chessdom (@chessdom) July 28, 2025 -
వరల్డ్‌కప్ టైటిల్ ఫలితం ఇక టై బ్రేకర్‌లోనే..!
బతూమి (జార్జియా): ఫిడే వరల్డ్‌కప్ టైటిల్ కోసం ఇద్దరు భారత చెస్ క్రీడాకారిణులు హోరాహోరీగా తలపడతున్నారు. అందులో ఒకరు తెలుగు తేజం కోనేరు హంపి కాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన దివ్యా దేశ్‌ముఖ్. టైటిల్ పోరులో భాగంగా ఇరువురి మధ్య జరిగిన రెండు వరుస గేమ్‌లు డ్రాగా ముగియడమే హోరాహోరీని తలపించింది.నిన్న జరిగిన తొలి గేమ్‌లో అనుభవాన్ని ఉపయోగించి కోనేరు హంపి డ్రా వరకు తీసుకెళ్లగా, ఈరోజు( ఆదివారం, జూలై 27) కూడా ఇంచుమించు అదే రిపీట్ అయ్యింది. తెల్లపావులతో ఈరోజు ఆటను మొదలు పెట్టిన హంపి.. నెమ్మదిగా ఆటన ప్రారంభించింది. గేమ్ లో ఇరువురు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో పావుల్ని ఒకరి నుంచి ఒకరు ఎక్చేంజ్ చేసుకుంటూ ఆధిక్యాన్ని నిలుపుకోవడం లో విఫలమయ్యారు.. ఇలా వీరి మధ్య గేమ్ కు డ్రాకు దారితీసింది. అయితే గేమ్‌పై ఫలితం వచ్చే అవకాశాలు లేవని భావించిన ఇరువురు 34 మూవ్ వద్ద డ్రాకు అంగీకరించారు. -
హంపి, దివ్య తొలి గేమ్ డ్రా
బతూమి (జార్జియా): భారత్‌కు ఖాయమైన వరల్డ్‌కప్ టైటిల్‌ను తమ పరం చేసుకునేందుకు తెలుగు తేజం కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ తొలి గేమ్‌లో దీటుగా ఎత్తుకు పైఎత్తులు వేశారు. దాంతో ఈ పోరు సమంగా ముగిసింది. ‘ఫిడే’ మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్లో శనివారం జరిగిన తొలి గేమ్‌లో 41 ఎత్తుల తర్వాత ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు మొగ్గు చూపారు. ఈ పోరులో నల్ల పావులతో బరిలోకి దిగిన హంపికి ఓపెనింగ్ ఎత్తుగడలేవీ కలిసి రాలేదు. గేమ్‌ను మొదలుపెట్టిన వ్యూహం, వేసిన ఎత్తులు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్‌ను కాస్త ఇరకాటంలో పెట్టాయి. దీంతో తెల్ల పావులతో ఆడుతున్న దివ్యకు అవి అదనపు బలాన్నిచ్చేలా చేశాయి. దీంతో 14వ ఎత్తు వరకు గేమ్ దివ్య నియంత్రణలోనే ఉంది. అయితే ఈ దశలో తేరుకున్న హంపి జాగ్రత్త పడింది. ఎత్తుగడ మార్చి పైఎత్తులతో గేమ్‌పై పట్టు పెంచుకుంది. దీంతో అక్కడి నుంచి ఆట పోటాపోటీగా సాగడంతో చివరకు డ్రా తప్పలేదు. ఇంటర్నేషనల్ మాస్టర్, 19 ఏళ్ల దివ్య ఒక దశలో వెటరన్ గ్రాండ్‌మాస్టర్‌కు చెమటలు పట్టించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ప్రయత్నించని డి4 గడి నుంచి ఓపెనింగ్ చేసిన దివ్య ఎత్తులు, చకచకా పావులు కదుపుతున్న తీరు ఆమె ఫైనల్ కోసం బాగా సన్నద్ధమైందనిపించింది. హంపిని ఒత్తిడికి గురి చేసేందుకు ఎత్తులకు పదునుపెట్టే క్రమంలో చాలా సమయం తీసుకుంది. మరో వైపు అనుభవజు్ఞరాలైన హంపి ఆరంభంలో ప్రత్యర్థి చురుకైన ఎత్తులకు ఏమాత్రం కంగారు పడకుండా తన గేమ్ ప్లాన్‌ను అమలు చేసింది. ఈ క్రమంలో ఆరంభంలో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఒత్తిడికి గురి కాలేదు. గేమ్ మధ్యలో పట్టు చిక్కించుకున్న హంపి... దివ్య జోరును అడ్డుకుంది. ఈ సమయంలో దివ్య గెలుస్తానన్న ధీమాతో డ్రాకు అంగీకరించలేదు. చివరకు గేమ్ సాగే కొద్దీ ఫలితంపై ఆశలు లేకపోవడంతో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ గేమ్ 41వ ఎత్తుల్లో డ్రా అయ్యింది. ఫైనల్లో భాగంగా నేడు రెండో గేమ్ జరుగుతుంది. ఇందులో గెలిచినవారు ప్రపంచ విజేతగా నిలుస్తారు. ఒకవేళ ఫలితం రాకపోతే రేపు టైబ్రేక్ ద్వారా చాంపియన్‌ను తేలుస్తారు. -
మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్ టైటిల్ భారత్ కు ఖరారు
-
చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్
అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అద్భుత విజయాన్ని అందుకున్న భారత చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా 19 ఏళ్ల దివ్య రికార్డు నెలకొల్పింది. జార్జియాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ సెమీఫైనల్లో మహారాష్ట్ర అమ్మాయి దివ్య 1.5–0.5తో 2017 ప్రపంచ చాంపియన్ టాన్ జోంగి (చైనా)పై గెలిచింది. మంగళవారం వీరిద్దరి మధ్య తొలి గేమ్ ‘డ్రా’కాగా... బుధవారం జరిగిన రెండో గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన దివ్య 101 ఎత్తుల్లో టాన్ జోంగిని ఓడించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయంతో దివ్య వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. తాజా ప్రదర్శనతో దివ్య ఖాతాలో తొలి గ్రాండ్‌మాస్టర్ (జీఎం) నార్మ్ కూడా చేరింది. కోనేరు హంపి (భారత్)–లె టింగ్జి (చైనా) మధ్య సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో దివ్య ఆడుతుంది. హంపి–లె టింగ్జి మధ్య బుధవారం జరిగిన రెండో గేమ్ కూడా 75 ఎత్తుల్లో ‘డ్రా’ కావడంతో ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. హంపి–టింగ్జి మధ్య ఈరోజు టైబ్రేక్ గేమ్స్ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
హారికపై గెలుపుతో సెమీస్‌లో దివ్య
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్‌కు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం), జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో సోమవారం జరిగిన టైబ్రేక్‌లో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల దివ్య 2–0తో విజయం సాధించింది. ఈ ఇద్దరి మధ్య ఆదివారం నిరీ్ణత రెండు గేమ్‌లు ముగిశాక స్కోరు 1–1తో సమంగా ఉండటంతో... విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ నిర్వహించారు. తొలి గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన దివ్య 57 ఎత్తుల్లో గెలిచింది. సెమీస్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచి్చతంగా గెలవాల్సిన రెండో గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హారిక 76 ఎత్తుల్లో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. నేడు జరిగే సెమీఫైనల్స్ తొలి గేమ్‌లలో టింగ్జీ లె (చైనా)తో భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి; టాన్ జోంగి (చైనా)తో దివ్య తలపడతారు. భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లు సెమీఫైనల్ చేరుకోవడంతో ఒక పతకం ఖాయమైంది. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి కూడా భారత్‌కు ఒక బెర్త్ ఖరారైంది. ప్రపంచకప్ టోర్నీలో టాప్–3లో నిలిచిన ప్లేయర్లు ప్రపంచ చాంపియన్ ప్రత్యరి్థని నిర్ణయించే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత పొందుతారు. -
ప్రపంచకప్ చెస్ క్వార్టర్ ఫైనల్లో హంపి, హారిక, వైశాలి, దివ్య
బతూమి (జార్జియా): తాడోపేడో తేల్చుకోవాల్సిన గేమ్‌లలో భారత చెస్ స్టార్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, దివ్య దేశ్‌ముఖ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ప్రపంచకప్ మహిళల నాకౌట్ చెస్ టోర్నీలో ఈ నలుగురూ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో గురువారం నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత భారత క్రీడాకారిణులు తమ ప్రత్యర్థులతో 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతలను నిర్ణయించేందుకు శుక్రవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. టైబ్రేక్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి 1.5–0.5తో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (స్విట్జర్లాండ్)పై... హైదరాబాద్ ప్లేయర్ హారిక 2.5–1.5తో ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ మాజీ చాంపియన్ కాటరీనా లాగ్నో (రష్యా)పై... తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ వైశాలి 3.5–2.5తో మెరూర్ట్ కమలిదెనోవా (కజకిస్తాన్)పై... ప్రపంచ జూనియర్ చాంపియన్, మహారాష్ట్ర అమ్మాయి దివ్య దేశ్‌ముఖ్ 1.5–0.5తో ఆసియా క్రీడల చాంపియన్ జు జినెర్ (చైనా)పై విజయం సాధించారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో యుజిన్ సాంగ్ (చైనా)తో హంపి; దివ్య దేశ్ముఖ్తో హారిక; టాన్ జోంగీ (చైనా)తో వైశాలి తలపడతారు. -
నాలుగో రౌండ్లో హంపి, దివ్య
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి, జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర) నాలుగో రౌండ్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో హంపి 1.5–0.5తో కులోన్ క్లౌడియా (పోలాండ్)పై, దివ్య 1.5–0.5తో టియోడోరా ఇంజాక్ (సెర్బియా)పై విజయం సాధించారు. ఆదివారం జరిగిన మూడో రౌండ్ రెండో గేమ్‌లో హంపి 44 ఎత్తుల్లో క్లౌడియాను ఓడించింది. ఇంజాక్‌తో జరిగిన రెండో గేమ్‌ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. శనివారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్‌ను హంపి 102 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... ఇంజాక్‌తో జరిగిన గేమ్‌లో దివ్య 39 ఎత్తుల్లో గెలిచింది. మూడో రౌండ్‌లోని రెండు గేమ్‌లు ముగిశాక భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక–స్టావ్‌రూలా (గ్రీస్), వంతిక అగర్వాల్–కాటరీనా లాగ్నో (రష్యా), వైశాలి–కరిస్సా యిప్ (అమెరికా) 1–1తో సమంగా నిలిచారు. దాంతో ఈరోజు టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించి విజేతలను నిర్ణయిస్తారు. -
హంపి, దివ్య విజయం
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో నాలుగో రోజు భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ మెరిశారు. హంపి వరుసగా రెండో విజయం నమోదు చేసుకోగా... దివ్య ఖాతాలో మూడో గెలుపు చేరింది. భారత్‌కే చెందిన ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్‌బాబుల మధ్య జరిగిన ముఖాముఖి పోరు ‘డ్రా’గా ముగిసింది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 33 ఎత్తుల్లో గెలిచింది. మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన మహారాష్ట్ర అమ్మాయి దివ్య 77 ఎత్తుల్లో విజయాన్ని అందుకుంది. హారిక, వైశాలి మధ్య జరిగిన గేమ్ 34 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ (మంగోలియా)తో జరిగిన గేమ్‌లో నుర్గుల్ సలీమోవా (బల్గేరియా) 55 ఎత్తుల్లో... జు జినెర్ (చైనా) 39 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందారు. 10 మంది క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. నాలుగో రౌండ్ తర్వాత జు జినెర్ 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... హంపి, దివ్య 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. హారిక, పొలీనా, మున్‌గున్‌తుల్ 2 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ (మంగోలియా) 34 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందగా... జు జినెర్ (చైనా)–మెలియా సలోమి (జార్జియా) మధ్య గేమ్ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. -
నమస్తే దివ్య..!
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ నొదిర్బెక్ యకుబొయెవ్(Nodirbek Yakubboev) తీరు మార్చుకున్నాడు. ప్రత్యర్థిని గౌరవించి సంస్కారం చూపాడు. ప్రాగ్ చెస్ ఫెస్టివల్లో భాగంగా చాలెంజర్ టోర్నమెంట్లో పాల్గొంటున్న నొదిర్బెక్ తనకు ఎదురైన భారత ప్రత్యర్థి, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్(Divya Deshmukh)కి రెండు చేతులు జోడించి ‘నమస్తే’ అన్నాడు. దీనికి దివ్య కూడా ప్రతి నమస్కారం చేసింది.కాగా 23 ఏళ్ల యకుబొయెవ్ మూడో రౌండ్‌కు ముందు దివ్యకు నమస్కరించాడు. ఈ రౌండ్లో ఉజ్బెకిస్తాన్ ఆటగాడు... భారత అమ్మాయిపై విజయం సాధించాడు. మూడు రౌండ్లలో ఒక గేమ్ నెగ్గిన దివ్య రెండు గేముల్లో ఓడింది. ఉజ్బెక్ ప్లేయర్ తాజా వ్యవహారశైలి గతంలో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ వైశాలి ఉదంతాన్ని మరిచిపోయేలా చేసింది. That moment when Nodirbek Yakubboev greeted Divya Deshmukh with a traditional "Namaste" before the start of their 3rd round game at @PragueChess Festival Challengers 2025! #praguechessfestival pic.twitter.com/07zSR0ymh6— ChessBase India (@ChessbaseIndia) March 1, 2025 అప్పుడేం జరిగిందంటే... జనవరిలో టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నీలో (విక్‌ఆన్‌జీ, నెదర్లాండ్స్) నొదిర్బెక్... వైశాలి మధ్య మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు ఆనవాయితీ ప్రకారం భారత అమ్మాయి కరచాలనం కోసం చేయి చాచగా... అదేం అక్కర్లేదన్నట్లుగా ఉజ్బెక్ ఆటగాడు షేక్‌హ్యాండ్‌కు నిరాకరించాడు. ఈ ‘నో షేక్‌హ్యాండ్’ ఉదంతం సోషల్ మీడియాలో వివాదం రేపింది. నెటిజన్లంతా నొదిర్బెక్ సంస్కారహీనుడంటూ కామెంట్లు పెట్టారు.ఇది కాస్తా వైరల్ కావడంతో వెంటనే ఉజ్బెకిస్తాన్ ఆటగాడు... కావాలని నిరాకరించలేదని, మతపరమైన కట్టుబాట్లతోనే పరాయి అమ్మాయి చేతిని తాకలేదని... ప్రతిభావంతురాలైన వైశాలీ అన్నా... భారతీయులన్నా తనకెంతో గౌరవమని ‘ఎక్స్’లో వివరణ ఇచ్చాడు. కేవలం ట్వీట్‌తో ఆగకుండా టోర్నీ ఆడేందుకు వచ్చిన అక్కాతమ్ముళ్లు వైశాలి, ప్రజ్ఞానందలతో పాటు తోడుగా వచ్చిన వారి తల్లి నాగలక్ష్మిని వ్యక్తిగతంగా కలిసి పూలు, చాక్లెట్లు ఇచ్చి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది. ఇదీ చదవండి:తెలంగాణ శుభారంభం పంచ్‌కుల: జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన ‘బి’ డివిజన్ పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 3–1 గోల్స్ తేడాతో అస్సాంపై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అస్సాం జట్టే ముందుగా బోణీ కొట్టింది. తొలి క్వార్టర్‌లోనే అస్సాం కెప్టెన్ మున్మునీ దాస్ 14వ నిమిషంలో చేసిన ఫీల్డ్ గోల్‌తో జట్టు 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ అస్సాం జోరు ఆ క్వార్టర్‌కే పరిమితమైంది.రెండో క్వార్టర్లో అనూహ్యంగా పుంజుకున్న తెలంగాణ అమ్మాయిలు ఏకంగా నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేయడంతో అస్సాం క్రీడాకారిణులు చేష్టలుడిగారు. 23 నిమిషంలో ప్రతివ కిండో, 26వ నిమిషంలో సుమి ముందరి, 28వ నిమిషంలో పూజ రాథోడ్ తలా ఒక గోల్ చేశారు. తర్వాతి క్వార్టర్లలో ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న తెలంగాణ 3–1తో జయకేతనం ఎగురవేసింది. ఇదే డివిజన్లో జరిగిన పూల్ ‘బి’ పోటీల్లో ఢిల్లీ 1–0తో హిమాచల్ ప్రదేశ్‌పై గెలుపొందగా... చత్తీస్‌గఢ్, చండీగఢ్‌ల మధ్య జరిగిన పోరు 1–1తో ‘డ్రా’గా ముగిసింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంకులో దివ్య దేశ్‌ముఖ్ (ఫోటోలు)
-
ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దిట్ట.. అందంలోనూ తగ్గేదేలే (ఫొటోలు)
-
Divya Deshmukh: ప్రపంచ చాంపియన్.. ఈ విషయాలు తెలుసా?
గాంధీనగర్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత యువ చెస్ తార దివ్య దేశ్‌ముఖ్ తన కెరీర్లో గొప్ప ఘనత సాధించింది. ప్రపంచ జూనియర్ మహిళల అండర్–20 చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా అవతరించింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 18 ఏళ్ల దివ్య 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.చివరిదైన 11వ రౌండ్లో దివ్య 57 ఎత్తుల్లో క్రస్తెవా బెలోస్లావా (బల్గేరియా)పై గెలిచింది. నాగపూర్‌కు చెందిన దివ్య ఈ టోర్నీలో తొమ్మిది గేముల్లో నెగ్గి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది.క్రచ్యాన్ మరియం (అర్మేనియా; 9.5 పాయింట్లు) రెండో స్థానాన్ని దక్కించుకోగా... అలవెర్దియెవా అయాన్ (అజర్బైజాన్; 8.5 పాయింట్లు) మూడో స్థానాన్ని సంపాదించింది. విజేతగా నిలిచిన దివ్యకు 2000 యూరోల (రూ. 1 లక్షా 79 వేలు) ప్రైజ్‌మనీతోపాటు స్వర్ణ పతకం, విన్నర్స్ ట్రోఫీ లభించాయి. విజయానంతరం దివ్య మాట్లాడుతూ.. ‘‘ఒత్తిడిని ఎలా అధిగమించాలో నాకు తెలుసు. ఆటను ఎలా ఆడాలో కూడా పూర్తిగా నేర్చుకున్న తర్వాతే నేను రంగంలోకి దిగాను’’ అంటూ హర్షం వ్యక్తం చేసింది.18 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య సాధించిన విజయాలు2020- ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్(టీమ్)- స్వర్ణం2022- వుమెన్స్ ఇండియన్ చెస్ చాంపియన్‌షిప్- విజేత2022- చెస్ ఒలింపియాడ్(వ్యక్తిగత విభాగం)- కాంస్యం2023- ఆసియా మహిళా చెస్ చాంపియన్‌షిప్- విజేత2023- టాటా స్టీల్ ఇండియా చెస్ టోర్నమెంట్(వుమెన్స్ రాపిడ్)- ప్రథమ స్థానం2024- ఫిడే వరల్డ్ అండర్ 20 గర్ల్స్ చెస్ చాంపియన్‌షిప్- చాంపియన్. -
భారత్‌కు 8 పతకాలు
న్యూఢిల్లీ: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. మంగోలియాలో జరిగిన ఈ టోర్నీలో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్య పతకాలను సాధించారు. అండర్-12 బాలబాలికల విభాగంలో రెండు స్వర్ణాలను భారత క్రీడాకారులే గెలుచుకున్నారు. బాలుర ఈవెంట్లో ప్రజ్ఞానానంద, బాలికల విభాగంలో దివ్యా దేశ్‌ముఖ్ విజేతలుగా నిలిచారు. ఇదివరకే దివ్య బ్లిట్జ్‌లో స్వర్ణం, ర్యాపిడ్ ఈవెంట్లో రజతాన్ని నెగ్గింది.