
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం), జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో సోమవారం జరిగిన టైబ్రేక్‌లో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల దివ్య 2–0తో విజయం సాధించింది. ఈ ఇద్దరి మధ్య ఆదివారం నిరీ్ణత రెండు గేమ్‌లు ముగిశాక స్కోరు 1–1తో సమంగా ఉండటంతో... విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ నిర్వహించారు. తొలి గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన దివ్య 57 ఎత్తుల్లో గెలిచింది.
సెమీస్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచి్చతంగా గెలవాల్సిన రెండో గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హారిక 76 ఎత్తుల్లో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. నేడు జరిగే సెమీఫైనల్స్ తొలి గేమ్‌లలో టింగ్‌జీ లె (చైనా)తో భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి; టాన్ జోంగి (చైనా)తో దివ్య తలపడతారు. భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లు సెమీఫైనల్ చేరుకోవడంతో ఒక పతకం ఖాయమైంది. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి కూడా భారత్‌కు ఒక బెర్త్ ఖరారైంది. ప్రపంచకప్ టోర్నీలో టాప్–3లో నిలిచిన ప్లేయర్లు ప్రపంచ చాంపియన్ ప్రత్యరి్థని నిర్ణయించే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత పొందుతారు.