భారత్‌లో గ్యాస్‌ కష్టాలు తీరనున్నాయ్‌! | LPG Tanker Shivalik Reaches Mundra In Gujarat From Qatar Amid Strait Of Hormuz Tensions, Ensuring Relief For India Gas Supply | Sakshi
Sakshi News home page

భారత్‌లో గ్యాస్‌ కష్టాలు తీరనున్నాయ్‌!

Mar 16 2026 11:37 AM | Updated on Mar 16 2026 12:09 PM

LPG Tanker Shivalik Reaches Mundra in Gujarat from Qatar Amid Strait of Hormuz Tensions

న్యూఢిల్లీ: భారత్‌లో గ్యాస్‌ కష్టాలు తీరనున్నాయి. ఖతార్‌ నుంచి శివాలిక్‌ నౌక భారత్‌ చేరుకుంది. ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధి దాటి  గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు శివాలిక్‌ నౌక చేరుకుంది. ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్‌ టన్నుల ఎల్పీజీ గ్యాస్‌ ఉంది. ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌కు రక్షణగా భారత నావికా దళం వచ్చింది.

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  యాజమాన్యంలోని ఎల్‌పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్ సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుజరాత్‌కు చేరింది. ఖతార్‌లోని రాస్ లఫాన్ ఓడరేవు నుండి బయలుదేరిన శివాలిక్‌ హర్మూజ్‌ జలసంధి నుంచి ప్రయాణించింది. ఇవాళ గుజరాత్‌ రాష్ట్రం కచ్ జిల్లాలోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది. ఈ నౌక సుమారు 40వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని తీసుకువచ్చింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాలో అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఎల్‌పీజీ గ్యాస్‌ నౌక భారత్‌కు సురక్షితంగా రావడం శుభపరిణామ. దేశీయ వంట గ్యాస్‌ కొరతను తగ్గించడంలో సహాయపడుతోంది.  

రాస్ లఫాన్ నుండి బయలుదేరిన మరో నౌక  నందా దేవి ఇప్పటికే గుజరాత్ తీరానికి దూరంగా ఉంది. రేపు (మార్చి 17న) ఉదయం 6:30 గంటలకు గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని రవాణా చేస్తోంది. ఈ రెండు నౌకలు కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని తీసుకువస్తున్నాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement