breaking news
kattar
-
భారత్‌లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్!
న్యూఢిల్లీ: భారత్‌లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. ఖతార్ నుంచి శివాలిక్ నౌక భారత్ చేరుకుంది. ఇరాన్ హర్మూజ్ జలసంధి దాటి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక చేరుకుంది. ఐఎన్ఎస్ శివాలిక్ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఐఎన్ఎస్ శివాలిక్‌కు రక్షణగా భారత నావికా దళం వచ్చింది.షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్ సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుజరాత్‌కు చేరింది. ఖతార్‌లోని రాస్ లఫాన్ ఓడరేవు నుండి బయలుదేరిన శివాలిక్ హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించింది. ఇవాళ గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది. ఈ నౌక సుమారు 40వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువచ్చింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాలో అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఎల్పీజీ గ్యాస్ నౌక భారత్‌కు సురక్షితంగా రావడం శుభపరిణామ. దేశీయ వంట గ్యాస్ కొరతను తగ్గించడంలో సహాయపడుతోంది. రాస్ లఫాన్ నుండి బయలుదేరిన మరో నౌక నందా దేవి ఇప్పటికే గుజరాత్ తీరానికి దూరంగా ఉంది. రేపు (మార్చి 17న) ఉదయం 6:30 గంటలకు గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని రవాణా చేస్తోంది. ఈ రెండు నౌకలు కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తున్నాయి. #Fujairah #IranIsraelWar #GlobalEnergy #PMModi #IndianShips #NandaDevi #Shivalik #Delhi $BJP 54 हजार टन LPG लेकर जहाज ‘शिवालिक’ आज मुद्रा पोर्ट पहुंचेगा,नई दिल्ली. मोदी सरकार की कुशल रणनीति और ईरान–इजराइल तनाव के बीच भारत के लिए राहत की खबर है, करीब 54 हजार टन एलपीजी गैस लेकर… pic.twitter.com/YbqSa3dnBM— सिरोही की आवाज (@Sirohikiaawaz) March 16, 2026 -
'బీజేపీతో వేర్పాటువాదం అంతమైంది'
కర్నాల్: హర్యానా రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రాంతీయ వాదం పూర్తిగా నశించిందన్నారు. ఆదివారం కర్నాల్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్ నేషనల్ కల్చరల్ ఫెస్టివల్ 2015 ప్రారంబోత్సవ కార్యక్రమంలో కట్టర్ పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం సంతులనంతో కూడిన అభివృద్ధిని సాధిస్తున్నందున ఏ ప్రత్యేక ప్రాంతానికి నష్టం జరగడం లేదన్నారు. కులం, మతం ప్రాతిపదికన ప్రజలు వేర్పాటు వాదాన్ని కోరుకునే స్థితి నుండి ప్రజలు బయటపడ్డారన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికుల వేతనాలను పెంచుతున్నట్లు కట్టర్ ప్రకటించాడు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచనున్నట్లు చెప్పారు. హర్యానా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


