
బతూమి (జార్జియా): ఫిడే వరల్డ్‌కప్ టైటిల్ కోసం ఇద్దరు భారత చెస్ క్రీడాకారిణులు హోరాహోరీగా తలపడతున్నారు. అందులో ఒకరు తెలుగు తేజం కోనేరు హంపి కాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన దివ్యా దేశ్‌ముఖ్. టైటిల్ పోరులో భాగంగా ఇరువురి మధ్య జరిగిన రెండు వరుస గేమ్‌లు డ్రాగా ముగియడమే హోరాహోరీని తలపించింది.
నిన్న జరిగిన తొలి గేమ్‌లో అనుభవాన్ని ఉపయోగించి కోనేరు హంపి డ్రా వరకు తీసుకెళ్లగా, ఈరోజు( ఆదివారం, జూలై 27) కూడా ఇంచుమించు అదే రిపీట్ అయ్యింది. తెల్లపావులతో ఈరోజు ఆటను మొదలు పెట్టిన హంపి.. నెమ్మదిగా ఆటన ప్రారంభించింది. గేమ్ లో ఇరువురు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో పావుల్ని ఒకరి నుంచి ఒకరు ఎక్చేంజ్ చేసుకుంటూ ఆధిక్యాన్ని నిలుపుకోవడం లో విఫలమయ్యారు.. ఇలా వీరి మధ్య గేమ్ కు డ్రాకు దారితీసింది. అయితే గేమ్‌పై ఫలితం వచ్చే అవకాశాలు లేవని భావించిన ఇరువురు 34 మూవ్ వద్ద డ్రాకు అంగీకరించారు.