breaking news
R Praggnanandhaa
-
సింక్ఫీల్డ్ కప్‌లో అదరగొట్టిన ప్రజ్ఞానంద
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద సింక్ఫీల్డ్ కప్‌లో అదరగొట్టాడు. ఫ్రాన్స్‌కు చెందిన మాక్సిమ్ వాచియర్-లాగ్రేవ్పై కేవలం 28 ఎత్తుల్లోనే విజయం సాధించి, టోర్నీలో జాయింట్ లీడ్‌లోకి దూసుకెళ్లాడు.ఎనిమిదో, పెనాల్టిమేట్ రౌండ్లో లాగ్రేవ్‌ను ఓడించిన ప్రజ్ఞానంద 8 రౌండ్లలో 5 పాయింట్లు సాధించాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో కూడా 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఫలితంతో ప్రజ్ఞానంద ఈ ఏడాది చివర్లో జరగనున్న గ్రాండ్ ఫైనల్‌కు అర్హత కూడా ఖాయం చేసుకున్నాడు.వరుసగా మూడో విజయంతో సిందరోవ్ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ జవోఖిర్ సిందరోవ్ కూడా అద్భుత ఫామ్‌లోకి వచ్చాడు. డచ్ ఆటగాడు జోర్డెన్ వాన్ ఫోరెస్ట్పై విజయం సాధించి వరుసగా మూడో గేమ్ గెలిచాడు.దీంతో సిందరోవ్ 4.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. మరోవైపు జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ టాప్ సీడ్ అమెరికన్ ఫాబియానో కరువానాను ఓడించి 4.5 పాయింట్లతో సిందరోవ్‌తో కలిసి మూడో స్థానాన్ని పంచుకుంటున్నాడు.మరో మ్యాచ్‌లో అమెరికాకు చెందిన లెవోన్ అరోనియన్, నెదర్లాండ్స్‌కు చెందిన అనిష్ గిరి డ్రా చేసుకున్నారు.చివరి రౌండ్లో ప్రజ్ఞానందతో పోటీపడనున్న గిరిఇప్పుడు అందరి దృష్టి చివరి రౌండ్‌పైనే ఉంది. ప్రజ్ఞానంద తెల్ల పావులతో అనిష్ గిరితో తలపడనున్నాడు. మరో కీలక పోరులో సిందరోవ్, వెస్లీ సోను ఎదుర్కోనున్నాడు. ఇక కీమర్.. వాన్ ఫోరెస్ట్‌తో ఆడనున్నాడు. కీమర్ విజయం సాధిస్తే అతడూ అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంది. 5 పాయింట్లతో ప్రజ్ఞానంద, వెస్లీ సో సంయుక్త ఆధిక్యంలో ఉండగా.. చివరి రౌండ్ ఫలితాలు సింక్ఫీల్డ్ కప్ విజేతను నిర్ణయించనున్నాయి. -
జోరు మీదున్న ప్రజ్ఞానంద.. వైశాలి ఓటమి
సెయింట్ లూయిస్: సింక్ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ఖాతాలో రెండో విజయం చేరింది. జోర్డెన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో ప్రజ్ఞానంద 71 ఎత్తుల్లో గెలుపొందాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. నాలుగో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 2.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. మూడు పాయింట్లతో వెస్లీ సో (అమెరికా) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.హంపి గేమ్ ‘డ్రా’కెయిన్స్ కప్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నీలో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి ఖాతాలో మూడో ‘డ్రా’ చేరింది. ప్రపంచ మాజీ చాంపియన్ అనా ముజీచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హంపి 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. నాలుగో రౌండ్ తర్వాత హంపి 1.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్ తొలి ‘డ్రా’ నమోదు చేసుకోగా... వైశాలి రెండో ఓటమిని చవిచూసింది. కరిస్సా యిప్ (అమెరికా)తో జరిగిన గేమ్‌ను దివ్య 68 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. టాన్ జోంగి (చైనా)తో జరిగిన గేమ్‌లో వైశాలి 40 ఎత్తుల్లో ఓడిపోయింది. దివ్య 2.5 పాయింట్లతో ఐదో స్థానంలో, ఒక పాయింట్‌తో వైశాలి తొమ్మిదో స్థానంలో ఉన్నారు. -
ప్రజ్ఞానంద అద్భుత విజయం.. టైటిల్ సొంతం
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించాడు. తొలిసారిగా సెయింట్ లూయీస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మరో రౌండ్ మిగిలి ఉండగానే అతడు ఈ ఘనత సాధించడం విశేషం.చెన్నైకి చెందిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఇప్పటికే ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. తాజాగా సెయింట్ లూయీస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ (Saint Louis Rapid & Blitz title) టోర్నీలోనూ అదరగొట్టాడు. అమెరికాలో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జొవోఖిర్ సిందరోవ్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద.. మొత్తంగా 23.5 పాయింట్లు తన ఖాతాలో జమచేసుకున్నాడు.అగ్రస్థానంలోమిగతా ఆటగాళ్ల కంటే ఒకటిన్నర పాయింట్లు ఎక్కువగా కలిగి ఉండటంతో.. మరో రౌండ్ మిగిలి ఉండగానే ప్రజ్ఞానంద విజేతగా అవతరించాడు. పాయింట్ల పరంగా ప్రజ్ఞానంద అగ్రస్థానంలో నిలవగా.. సిందరోవ్ 22 పాయింట్లతో రెండు, అమెరికా గ్రాండ్ మాస్టర్ విస్లే 20.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.ఇక సెయింట్ లూయీస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలుపుతో ఓవరాల్ గ్రాండ్ చెస్ టూర్ (GCT) పాయింట్ల పట్టికలో ప్రజ్ఞానంద రెండో స్థానానికి చేరుకున్నాడు. తద్వారా జీసీటీ ఫైనల్స్‌కు చేరుకునే మార్గం సుగమం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్ కూడా గెలిచిన విషయం తెలిసిందే.చదవండి: స్వర్ణం గెలిచినా అస్మితకు నిరాశేనా? -
సీఎం విజయ్‌తో చెస్ సంచలనం ప్రజ్ఞానంద
భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద నార్వే చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో సోమవారం తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌ని ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ప్రజ్ఞానందను అభినందించడమే గాక అతడితో సరదాగా చెస్ ఆడాడు. అతడి ప్రదర్శనతో తమిళనాడు గర్విస్తోందని పేర్కొన్న విజయ్ ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల చెక్కును రివార్డుగా అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఓస్లో వేదికగా జరిగిన టోర్నీలో ప్రజ్ఞానంద ఫైనల్లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌ను మట్టికరిపించి చాంపియన్‌షిప్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. టోర్నీ ఆరంభంలో తడబడిన ప్రజ్ఞానంద చివరి దశలో అనూహ్యంగా ఫుంజుకున్నాడు. పదో రౌండ్ ప్రారంభానికి ముందు 15 పాయింట్లతో ప్రజ్ఞానంద ముందు వరుసలో నిలిచాడు. ఆఖరి రౌండ్లో విన్సెంట్ కీమర్‌ను ఓడించిన ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకున్నాడు. ఇక నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన ప్రజ్ఞానందకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు అభినందించారు.#WATCH | Chennai | Tamil Nadu CM Vijay meets Indian Grandmaster R Praggnanandhaa and awards him Rs 50 lakh on behalf of the Sports Development Authority of Tamil Nadu after the chess player won the Norway Chess 2026 title.(Source: TNDIPR) pic.twitter.com/Lf4dNgYrEX— ANI (@ANI) June 8, 2026చదవండి: మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియన్స్! -
చరిత్ర సృష్టించిన వైశాలీ.. తమ్ముడి బాటలోనే అక్క!!
భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద బాటలోనే సోదరి ఆర్ వైశాలీ నడిచింది. జపాన్ వేదికగా జరిగిన డబ్ల్యూఆర్ వుమెన్స్ చెస్ టూర్ టైటిల్‌ను వైశాలీ సొంతం చేసుకుంది. తద్వారా వుమెన్స్ క్యాండిడేట్ చెస్ టోర్నీ నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఎనిమిది మంది క్రీడాకారిణుల మధ్య జరిగిన ర్యాపిడ్ చెస్ ఈవెంట్లో వైశాలీ తొలి స్థానంలో నిలవగా, అలెంగ్జాడ్రా కొస్తేనుక్ (రష్యా), ఆంటోనెటా స్టిఫనోవా (బల్గేరియా) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 24 ఏళ్ల వైశాలీ శనివారం తన ఫైనల్ రౌండ్లో కజకిస్తాన్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ అలువా నూర్మన్‌తో తలపడింది. రెండు గేముల పోరులో 1.5-0.5 తేడాతో చిత్తు చేసింది. అంతకముందు మాజీ చాంపియన్ కోస్టేనియుక్ను కూడా ఇదే తేడాతో ఓడించిన వైశాలీ ఫైనల్‌కు చేరుకుంది. ఇక క్వార్టర్ ఫైనల్లో వైశాలీ ఒక గేమ్ గెలిచి మరొక గేమ్‌ను డ్రా చేసుకుంది. ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను గెలిచిన వైశాలీ నేటి నుంచి ప్రారంభం కానున్న బ్లిట్జ్ చెస్ ఈవెంట్‌ను కూడా గెలిచి డబుల్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ పోటీలో పాల్గొన్న ఇతర క్రీడాకారిణులు అన్నా సర్గ్స్యాన్, ఐరిన్ సుకందర్, అలువా నూర్మాన్,అజుమి సకాయ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.అయితే వైశాలీ ర్యాపిడ్ చెస్ టైటిల్ గెలవడానికి కొన్ని గంటల ముందే ఆమె సోదరుడు ఆర్ ప్రజ్ఞానంద నార్వే క్లాసికల్ చెస్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన మొదటి భారతీయుడిగా నిలిచాడు.చదవండి: కెప్టెన్సీ తెచ్చిన జోష్.. శ్రేయస్ అయ్యర్ విధ్వంసం! -
చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు
భారత చెస్ సంచలనం, 20 ఏళ్ల యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తాచాటాడు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ (Norway Chess) టోర్నమెంట్ విజేతగా ప్రజ్ఞానంద నిలిచాడు. చివరి రౌండ్లో జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కీమర్‌ను మట్టికరిపించి ఛాంపియన్షిప్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా నార్వే చెస్ టైటిల్‌ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.అద్భుతమైన కమ్బ్యాక్ప్రజ్ఞానంద సాధించిన ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. టోర్నీ ఆరంభంలో అతడు తడబడ్డాడు. దీంతో అతడి కథ ముగిసిందని అంతా భావించారు. కానీ టోర్నీ చివరి దశలో అతడు పుంజుకున్న తీరు నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. పదో రౌండ్ ప్రారంభానికి ముందు 15 పాయింట్లతో ప్రజ్ఞానంద ముందు వరుసలో నిలిచాడు. చివరి రౌండ్ ఆరంభానికి ముందు టైటిల్ కోసం ప్రజ్ఞానంద, వెస్లీ సో (అమెరికా), అలీరెజా ఫిరౌజ్జా (ఫ్రాన్స్) మధ్య పోటీ నెలకొంది. చివరి రౌండ్లో వెస్లీ సో, అలీరెజా ఫిరౌజ్జాపై 'అర్మగెడాన్' టై బ్రేకర్ మ్యాచ్‌లో విజయం సాధించి తన టైటిల్ ఆశలను సజీవంగా ఉంచుకున్నాడు. కానీ ప్రజ్ఞానంద మెయిన్ క్లాసికల్ మ్యాచ్‌లో విన్సెంట్ కీమర్‌ను ఓడించడంతో.. ఈ తమిళనాడు కుర్రాడుకి వెస్లీ సో కంటే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. దీంతో 18 పాయింట్లతో వెస్లీ(17)ను వెనక్కి నెట్టి ప్రజ్ఞానంద నార్వే చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. కాగా ఏడుసార్లు నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించడం గమనార్హం.🇮🇳 PRAGG WINS NORWAY CHESS 2026From last place in round 6, and 4 back-to-back wins, he finishes first 🤯🤯#NorwayChess pic.twitter.com/J0XbX91NQ4— Norway Chess (@NorwayChess) June 5, 2026ప్రముఖల అభినందనలునార్వే చెస్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ తదితరులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
వరల్డ్ నంబర్‌వన్‌ను చావుదెబ్బ కొట్టిన ప్రజ్ఞానంద!
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీ 2026లో మరోసారి సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను క్లాసికల్ చెస్‌లో వరుసగా రెండోసారి ఓడించి చావుదెబ్బ కొట్టాడు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రజ్ఞానందకు కార్ల్‌సన్‌పై తాజా విజయం ఆ ప్రయత్నాలకు ఊతమిచ్చినట్లయింది. అంతేకాదు నార్వే చెస్ టోర్నీలో కార్ల్‌సన్‌ను అతడి సొంతగడ్డపైనే రెండుసార్లు మట్టికరిపించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు ఈ ఏడాది క్లాసికల్ చెస్ గేమ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన తొలి ఆటగాడు కూడా ప్రజ్ఞానందనే కావడం విశేషం. మంగళవారం రాత్రి జరిగిన ఎనిమిదో రౌండ్లో ప్రజ్ఞానంద నల్లపావులతో బరిలోకి దిగాడు. కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఎనిమిదోసారి నార్వే చెస్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనుకున్న కార్ల్సన్ ఆశలకు ప్రజ్ఞానంద గండికొట్టినట్లయింది. ఇప్పటికే 8 రౌండ్లు పూర్తి కావడం, మరో రెండు రౌండ్లు మాత్రమే మిగిలిఉండడంతో కార్ల్సన్ టైటిల్‌ను నిలబెట్టుకోవడం కష్టమే. గేమ్‌లో ప్రజ్ఞానంద విజయం ఖాయమైన తర్వాత కార్ల్సన్ మొహం మాడిపోయింది. ఓటమి బాధలో కనీసం ప్రజ్ఞానందకు అభినందనలు కూడా తెలియజేయకుండా అక్కడి నుంచి నిరాశతో వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టాండింగ్స్ విషయానికొస్తే.. అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో తన రన్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కైమర్‌ను టై-బ్రేక్‌లో ఓడించి 14 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నాడు. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ అలీరెజా ఫిరౌజా 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మరో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఓటమితో 8 పాయింట్లు మాత్రమే కలిగిన అతడు క్లాసికల్ చెస్ టోర్నీ టైటిల్ సాధించే అవకాశం కోల్పోయాడు. మిగిలిన రెండు గేములు గెలిచినా గుకేశ్ 14 పాయింట్ల వద్దే ఆగిపోనున్నాడు.Check out the incredible final moments of Praggnanandhaa taking down World no.1 Magnus Carlsen with the Black pieces in Round 8 of Norway Chess 2026!With this win, Pragg becomes the first Indian (and possibly in the world) player who defeated Magnus Carlsen in Classical Chess… pic.twitter.com/MFvJPdBHel— ChessBase India (@ChessbaseIndia) June 2, 2026చదవండి: ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్‌లీడర్స్‌తో క్రికెటర్ల బంధం!


