PC: X
భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత ప్లేయింగ్ ఎలెవన్‌కు సంబంధించి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బిగ్ హింట్ ఇచ్చాడు. తొలి టెస్ట్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో పాటు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశముంది.
రవీంద్ర జడేజా, మానవ్ సుత్తార్, కుల్దీప్ యాదవ్ పేర్లు స్పిన్నర్లగా ఖారారైనట్లు సమాచారం. అదేవిధంగా పేస్ బౌలింగ్ విభాగంలో సీనియర్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌తో కర్ణాటక స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ణ బంతిని పంచుకోనున్నట్లు గిల్ సంకేతాలు ఇచ్చాడు. దీంతో గుర్నూర్ బ్రార్, జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ అకిబ్ నబీలు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది.
"గుర్నూర్ బ్రార్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పాత బంతితో కూడా అతడు బౌన్స్ రాబట్టగలడు. అయితే మరోవైపు ప్రసిద్ద్ కృష్ణ కూడా గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రసిద్ధ్ ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సత్తాచాటాడు. అందుకే వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవడం నిజంగా కష్టమైన నిర్ణయమే.
జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ప్రసిద్ద్, బ్రార్ వంటి పేస్ బౌలర్లకు తమ సత్తా చాటుకునేందుకు ఈ సిరీస్ ఒక మంచి అవకాశం" అని గిల్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో తన టాలెంట్‌ను నిరూపించుకోవడంతో గుర్నూర్ బ్రార్‌ను శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు కూడా ఎంపిక చేశారు.
కానీ శ్రీలంక కండీషన్స్ కారణంగా అతడికి తుది జట్టులో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. లంక పిచ్‌లు ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ముగ్గురు ఫుల్ టైమ్ స్పిన్నర్లతో బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది.
భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవద్ పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ ( వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ


