కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత జావెలిన్ త్రోయర్స్ సత్తా చాటారు. ఒలింపిక్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రా (85.83 మీటర్లు) మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. ఇవాళ జరిగిన ఫైనల్లో నీరజ్ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించారు. ఈ ఫైనల్‌లో శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే 89.75 మీటర్లు విసిరి అగ్రస్థానంతో పాటు స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
ఇదే ఫైనల్లో మన దేశానికే చెందిన మరో జావెలిన్ త్రోయర్ యశ్వీర్ సింగ్ (85.41 మీ) విసిరి మూడోస్థానంలో నిలిచారు. ఈ ప్రదర్శనతో కాంస్యం పతకం దక్కించుకున్నారు. యశ్‌వీర్ తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఇండియాకే చెందిన మరో జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్(81.56 మీటర్లు) ఆరోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ ప్రదర్శనతో కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 23కు చేరుకుంది.


