breaking news
shelton
-
అటు షెల్టన్ ఇటు స్వియాటెక్
మాంట్రియల్: నేషనల్ బ్యాంక్ ఓపెన్ ఏటీపీ–1000 మాస్టర్స్ సిరీస్ టోరీ్నలో అమెరికా ప్లేయర్ బెన్ షెల్టన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో గత ఏడాది విజేత షెల్టన్ 6–3, 7–6 (7/4)తో అమెరికాకే చెందిన బ్రాండన్ నకషిమాపై విజయం సాధించాడు. 2019లో రాఫెల్ నాదల్ తర్వాత వరుసగా రెండేళ్లు ఈ టోర్నీ టైటిల్ నెగ్గిన షెల్టన్ ఈసారి ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు.87 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో షెల్టన్ ఏడు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన షెల్టన్ తన సర్వీస్‌లో ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వలేదు. విజేతగా నిలిచిన షెల్టన్‌కు 15,14,200 డాలర్ల (రూ. 14 కోట్ల 48 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తాజా విజయంతో వచ్చే సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో షెల్టన్ ఆరో ర్యాంక్‌కు చేరుకుంటాడు.టొరంటో: ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఈ ఏడాది తొలి టైటిల్‌ను సాధించింది. నేషనల్ బ్యాంక్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోరీ్నలో స్వియాటెక్ చాంపియన్‌గా నిలిచింది. కజకిస్తాన్‌కు చెందిన రెండో సీడ్ రిబాకినాతో జరిగిన ఫైనల్లో ఏడో సీడ్ స్వియాటెక్ 6–2, 6–3తో విజయం సాధించింది.స్వియాటెక్ కెరీర్లో ఇది 26వ సింగిల్స్ టైటిల్. 75 నిమిషాలపాటు జరిగిన టైటిల్ పోరులో స్వియాటెక్ ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. టైటిల్ గెలిచిన స్వియాటెక్‌కు 10,85,220 డాలర్ల (రూ. 10 కోట్ల 37 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
షెల్టన్‌కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రెండో రోజు మంగళవారం సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 140వ ర్యాంకర్ ఒట్టో విర్టానెన్ (ఫిన్లాండ్) అద్భుత ప్రదర్శనతో షెల్టన్‌ను బోల్తా కొట్టించాడు. కెరీర్లో ఆరోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న విర్టానెన్ 6–4, 3–6, 6–7 (8/10), 6–2, 7–6 (11/9)తో షెల్టన్‌పై గెలిచి రెండోసారి వింబుల్డన్ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 4 గంటల 21 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విర్టానెన్ 14 ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. మరోవైపు షెల్టన్ 19 ఏస్‌లు కొట్టి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 60 సార్లు దూసుకొచ్చిన విర్టానెన్ 35 సార్లు పాయింట్లు గెలిచాడు. షెల్టన్ 66 సార్లు నెట్‌వద్దకు వచ్చి 43 సార్లు పాయింట్లు సాధించాడు. షెల్టన్ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన విర్టానెన్ తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. 60 విన్నర్స్ కొట్టిన విర్టానెన్ 47 అనవసర తప్పిదాలు చేశాడు. షెల్టన్ 68 విన్నర్స్ కొట్టి, 41 అనవసర తప్పిదాలు చేశాడు. అయితే కీలకమైన టైబ్రేక్‌లో విర్టానెన్ పైచేయి సాధించి విజయాన్ని అందుకున్నాడు. కష్టపడి గెలిచిన జ్వెరెవ్ మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) తొలి రౌండ్ దాటడానికి శ్రమించాడు. 2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జ్వెరెవ్ 6–4, 6–7 (8/10), 7–6 (7/5), 7–6 (7/0)తో అలెగ్జాండర్ బ్లాక్స్ (బెల్జియం)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా) 7–6 (7/5), 6–1, 6–0తో బురుచాగా (అర్జెంటీనా)పై, ఆరో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–3, 6–4, 6–3తో లాజోవిచ్ (సెర్బియా)పై, పదో సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్) 3 గంటల 40 నిమిషాల్లో 4–6, 6–3, 6–7 (10/12), 6–3, 6–4తో కొకినాకిస్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించారు. జొకోవిచ్ శుభారంభం కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో జొకోవిచ్ 6–4, 5–7, 6–4, 6–4తో చైనా ప్లేయర్ యిబింగ్ వుపై గెలుపొంది రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 12 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 15 ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. స్వితోలినా నిష్క్ర మణ మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) తొలి రౌండ్లోనే నిష్క్ర మించింది. డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), మాజీ విజేత రిబాకినా (కజకిస్తాన్) మూడు సెట్లపాటు పోరాడి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. దరియా స్నిగుర్ (ఉక్రెయిన్) 7–5, 6–2తో స్వితోలినాపై సంచలన విజయం సాధించింది. స్వియాటెక్ 6–1, 2–6, 6–3తో టేలర్ టౌన్సెండ్ (అమెరికా)పై, రెండో సీడ్ రిబాకినా 6–4, 1–6, 6–3తో లూయిస్ బోయిసన్ (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ అనిసిమోవా (అమెరికా) 6–3, 6–2తో లీనా జొర్జెస్కా (నార్త్ మెసిడోనియా)పై విజయం సాధించారు. -
కాక్టైల్ కింగ్..
కేర్‌ఫుల్‌గా కాక్టైల్ రెడీ చేస్తున్న ఈ బార్టెండర్ పేరు షెల్డన్ వైలీ. ఇతనికి కాక్టైల్ కింగ్ అని పేరు. అందుకే మంగళవారం న్యూయార్క్‌లోని బౌన్స్ స్పోర్టింగ్ క్లబ్లో కేవలం గంట వ్యవధిలో ఏకంగా 1,905 కాక్టైల్స్ తయారుచేశాడు. అదీ ఏ వెరైటీ రిపీట్ కాకుండా.. దీంతో గిన్నిస్ బుక్వాళ్లు కూడా షెల్డన్ ప్రతిభకు మెచ్చేసి.. ఈ విభాగంలో ప్రపంచ రికార్డును అతడికి కట్టబెట్టేశారు.


