అష్మిత అదరహో | Ashmita into the quarter finals of the French Open Super 750 tournament | Sakshi
Sakshi News home page

అష్మిత అదరహో

Oct 23 2026 4:23 AM | Updated on Oct 23 2026 4:23 AM

Ashmita into the quarter finals of the French Open Super 750 tournament

ప్రపంచ 2వ ర్యాంకర్‌ అకానె యామగుచిపై విజయం

సింధు కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి

పారిస్‌: భారత యువ షట్లర్‌ అష్మిత చాలిహా తన కెరీర్‌లోనే మేటి విజయాన్ని అందుకుంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌–750 టోర్నీలో అష్మిత సంచలన ప్రదర్శనతో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్‌ అష్మిత 21–19, 21–18తో మూడుసార్లు ప్రపంచ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌)ను కంగుతినిపించింది. 

మరోవైపు భారత నంబర్‌వన్‌ పీవీ సింధు కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు 21–12, 21–16తో రికో గుంజి (జపాన్‌)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో తన్వీ శర్మ 11–21, 14–21తో టాప్‌ సీడ్‌ ఆన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. కొడాయ్‌ నరోకా (జపాన్‌)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్‌ ఆయుశ్‌ శెట్టి తలి గేమ్‌ను 17–21తో కోల్పోయి, రెండో గేమ్‌లో 6–11తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement