PC: BCCI X
శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన చర్యతో వార్తల్లో నిలిచాడు. లంక వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్‌వెల్లాను స్లెడ్జ్ చేసి.. అతడి ఏకాగ్రతను దెబ్బతీయడంలో జైసూ సఫలమయ్యాడు. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నపుడు డిక్‌వెల్లా స్టెడ్జింగ్‌కు పాల్పడగా.. ఐదో రోజు ఆటలో జైస్వాల్ ఈ మేరకు ప్రతీకారం తీర్చుకున్నాడు.
అసలేం జరిగిందంటే.. గాలె టెస్టులో టీమిండియా విధించిన 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆది నుంచే తడబడింది. ఈ క్రమంలో మంగళవారం నాటి నాలుగు రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 84 పరుగులే చేసింది.
ధనంజయ, దినుష పోరాటం
అయితే, కెప్టెన్ ధనంజయ డి సిల్వ (59), సొనాల్ దినుష (84) కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బుధవారం లంచ్‌కు ముందు రవీంద్ర జడేజా ధనంజయను అవుట్ చేయగా.. అతడి స్థానంలో నిరోషన్ డిక్‌వెల్లా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో జైస్వాల్ అతడిని స్లెడ్జ్ చేశాడు.
లంక రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్ ప్రసిద్ కృష్ణ 60వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగగా.. ఐదో బాల్‌కు డిక్‌వెల్లా రెండు పరుగులు తీశాడు. అప్పుడు స్వ్కేర్ లెగ్ ఫీల్డింగ్ పొజిషన్‌లో ఉన్న జైస్వాల్.. డిక్‌వెల్లాను మాటల్లో పెట్టాడు. వారి మధ్య సంభాషణ సాగిందిలా..
The art of on-field sledging, decoded! 🗣️🔥
Ajay Jadeja breaks down Yashasvi Jaiswal’s hilarious yet effective mind games that led directly to a crucial breakthrough! 🎯
Watch #SLvIND 2nd Test, starting 23rd August 9 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony… pic.twitter.com/dpTjsar1Qz— Sony Sports Network (@SonySportsNetwk) August 19, 2026
నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా.. సిక్సర్లు కొట్టు
జైస్వాల్: కమాన్ యార్.. తొలి ఇన్నింగ్స్‌లో బాగానే షాట్లు కొట్టావు కదా.. ఇప్పుడు కూడా అలాంటిదేదో కావాలి. కమాన్..
డిక్‌వెల్లా: అవునా?
జైస్వాల్: అవును. నువ్వు షాట్లు కొడుతుంటే చూడాలనుకుంటున్నాను. చేసి చూపించు మరి. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ బాదు.
డిక్‌వెల్లా: ఆ అవసరం ఇప్పుడు లేదు. నన్ను ఐపీఎల్‌కు తీసుకువెళ్లు. అక్కడ సిక్సర్లు బాదుతా.
జైస్వాల్: కచ్చితంగా వంద శాతం తీసుకెళ్తా. ఇప్పుడైతే సిక్సర్ కొట్టు. నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా.
డిక్‌వెల్లా: ధన్యవాదాలు.
ఇలా డిక్‌వెల్లా (10)ను జైస్వాల్ స్లెడ్జ్ చేయగా.. మరుసటి బంతికే అతడు వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 165 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. కాగా శ్రీలంకతో తొలి టెస్టులో జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసి.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు.


