PC: BCCI/ipl (ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలో పృథ్వీ షా)
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ తొలి మ్యాచ్ కోసం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. స్టార్ ఓపెనర్ పృథ్వీ షా ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆస్ట్రేలియా-ఎ తో పుదుచ్చేరిలో జరగనున్న మూడు అనధికారిక వన్డేల సిరీస్‌లో 'ఇండియా-ఎ' కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో రంజీ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే పృథ్వీ షాకు జట్టు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు.
ఈ వన్డే సిరీస్ అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో జరగనుంది. అలాగే ఆల్ రౌండర్ అర్షిన్ కులకర్ణి కూడా ఇండియా-ఎ జట్టులోనే భాగం కావడంతో తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ముంబై నుంచి మహారాష్ట్ర వరకు..2025-26 దేశవాళీ సీజన్‌కు ముందు ముంబైని వీడి మహారాష్ట్ర జట్టులో చేరిన పృథ్వీ షా, అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గత సీజన్‌లో 537 పరుగులు చేసి మహారాష్ట్ర తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
కెప్టెన్సీ ట్రాక్ రికార్డ్ అదుర్స్
పృథ్వీ షాకు కెప్టెన్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. అతడి సారథ్యంలోనే భారత జట్టు 2018 ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది.
అంతేకాకుండా ముంబై జట్టును విజయ్ హాజారే ట్రోఫీ విజేతగా నిలపడమే కాకుండా, 2021-22 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఈ రంజీ సీజన్‌లో మహారాష్ట్ర తన తొలి మ్యాచ్‌ను ఢిల్లీలోని పాలం 'ఎ' స్టేడియంలో సర్వీసెస్ జట్టుతో అక్టోబర్ 11 నుంచి ఆడనుంది.
మహారాష్ట్ర జట్టు
పృథ్వీ షా (కెప్టెన్), సచిన్ దాస్, దిగ్విజయ్ పాటిల్, అంకిత్ బవానే, హర్షల్ కేట్, సిద్ధేష్ వీర్, సౌరభ్ నవలే (వికెట్ కీపర్), విక్కీ ఓస్త్వాల్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, ముఖేష్ చౌదరి, ప్రదీప్ దాధే, తనయ్ సంఘ్వీ, వైభవ్ డార్కుండే, హితేష్ వాలుంజ్, రిషికేష్ సోనావానే, అథర్వ ధర్మాధికారి.


