భారత జట్టు (PC: BCCI X)
ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 క్రికెట్ టోర్నీ సెమీ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. జపాన్ వేదికగా గురువారం శ్రీలంక జట్టును ఏకంగా 124 పరుగుల తేడాతో మట్టికరిపించి భారీ గెలుపు నమోదు చేసింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది.
రెండు ప్రపంచ రికార్డులు
ఈ క్రమంలోనే భారత టీ20 క్రికెట్ జట్టు రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఓ మ్యాచ్‌లో వంద లేదంటే అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది.
తన రికార్డు తానే బద్దలు కొట్టి
పురుషుల అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో ఓ టోర్నీ సెమీ ఫైనల్ లేదంటే ఫైనల్లో అత్యధికంగా వందకు పైగా పరుగుల తేడాతో గెలిచిన తొలి జట్టు (ఫుల్ మెంబర్ జట్ల మధ్య ముఖాముఖి మ్యాచ్‌లో)గా టీమిండియా అవతరించింది.
ఇటీవల టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌పై అత్యధికంగా 96 పరుగుల తేడాతో గెలిచింది. తాజాగా శ్రీలంకను 124 పరుగుల తేడాతో చిత్తు చేసి గత రికార్డును సవరించింది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వంద లేదంటే అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో అత్యధిక విజయాలు సాధించిన జట్లు
👉ఇండియా- 11
👉కెనడా- 10
👉ఆస్ట్రియా- 9
👉జింబాబ్వే, నేపాల్, జపాన్, మలేషియా, ఉగాండా- 8
👉స్పెయిన్, టాంజానియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, డెన్మార్క్- 6
👉పపువా న్యూగినియా- 5.
చదవండి: IND vs PAK T20I: ఫైనల్‌లో భారత్, పాక్.. మ్యాచ్ ఎక్కడ చూడాలంటే?
𝐅𝐈𝐍𝐀𝐋 𝐊𝐈 𝐓𝐈𝐂𝐊𝐄𝐓 𝐂𝐎𝐍𝐅𝐈𝐑𝐌𝐄𝐃! ✨
After completely blowing away Sri Lanka for just 45 runs, Team India march into the Final for a massive clash against arch-rivals Pakistan! 💥
Watch the 20th Asian Games Aichi-Nagoya 2026 LIVE on Sony Sports Network TV… pic.twitter.com/YyvSZ0inzr— Sony Sports Network (@SonySportsNetwk) October 1, 2026


