ఇషాన్ కిషన్ (Photo Credit: BCCI X)
జపాన్ వేదికగా శ్రీలంకతో సెమీ ఫైనల్లో ఆరంభంలో తడబడ్డ టీమిండియా ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. ఓపెనర్ వైభవ్ సూర్యంశీ మెరుపులకు తోడు.. ఐదో నంబర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దంచికొట్టడంతో మెరుగైన స్కోరు సాధించగలిగింది.
ఆదిలోనే ఎదురుదెబ్బలు
ఆసియా క్రీడలు- 2026 పురుషుల టీ20 క్రికెట్ టోర్నీలో భాగంగా రెండో సెమీ ఫైనల్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లలో అభిషేక్ శర్మ (3 బంతుల్లో 7) వచ్చీ రాగానే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ (9 బంతుల్లో 7) కూడా విఫలమయ్యాడు.
అంతా ఫెయిల్
అయితే, మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపులు మెరిపించాడు. మొత్తంగా 21 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 38 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (13 బంతుల్లో 13)తో పాటు.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (13 బంతుల్లో 8), వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (4 బంతుల్లో 2), ఆల్‌రౌండర్ శివం దూబే (9 బంతుల్లో 3) పెవిలియన్‌కు వరుస కట్టారు.
𝐅𝐄𝐀𝐑𝐋𝐄𝐒𝐒. 𝐅𝐋𝐀𝐌𝐁𝐎𝐘𝐀𝐍𝐓. 𝐕𝐀𝚰𝐁𝐇𝐀𝐕! 🚀
The teenage sensation turns on the heat in the Men's Cricket Semi-Final at Aichi-Nagoya 2026 🔥
Watch India vs Sri Lanka, Men’s Cricket Semi-Final 2, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/DPlqKERcbu— Sony Sports Network (@SonySportsNetwk) October 1, 2026
ఆదుకున్న ఇషాన్
ఓవైపు వికెట్లు పడుతున్నా ఐదో నంబర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మాత్రం నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. కేవలం 46 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 80 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (3 బంతుల్లో 7 నాటౌట్) తోడుగా నిలిచాడు.
Pocket Dynamo's6️⃣
“IN HIS ARC, AND IT’S OUT OF THE PARK!” 🚀
Watch India vs Sri Lanka, Men’s Cricket Semi-Final 2, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026 #BaarBaarBharatHarBaarBharat pic.twitter.com/9KOtrjxmLL— Sony Sports Network (@SonySportsNetwk) October 1, 2026
లంక లక్ష్యం 170
ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్లు తరిందు రత్ననాయకె, కెప్టెన్ సహాన్ అరాచిగే చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. వనుజ సహాన్, లసిత్ క్రూస్పుల్లె, నువానిదు ఫెర్నాండో తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: ఇది అసలు క్రికెటే కాదు.. రికార్డుల కోసం మాత్రమేనా?: గంభీర్ అసహనం


