టీమిండియా బ్యాటింగ్‌.. తుది జట్టులో వైభవ్‌ | Asian games Mens Cricket Semi final 2, IND VS Sri Lanka: Sri Lanka Won the toss and choose to Field | Sakshi
Sakshi News home page

టీమిండియా బ్యాటింగ్‌.. తుది జట్టులో వైభవ్‌

Oct 1 2026 9:51 AM | Updated on Oct 1 2026 10:13 AM

Asian games Mens Cricket Semi final 2, IND VS Sri Lanka: Sri Lanka Won the toss and choose to Field

source: BCCI X

ఏషియన్‌ గేమ్స్‌ 2026 పురుషుల క్రికెట్‌లో భాగంగా ఇవాళ జరుగుతున్న రెండో సెమీఫైనల్లో భారత్‌, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. భారత తరఫున చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చాడు. 

అలాగే జపాన్‌తో జరిగిన ఏకైక టీ20కి విశ్రాంతి తీసుకున్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కూడా తుది జట్టులోకి వచ్చాడు. వైభవ్‌ తుది జట్టులోకి రావడంతో రెగ్యులర్‌ ఓపెనర్‌ సంజూ శాంసన్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంది.

తుది జట్లు..
భారత్ (ప్లేయింగ్ XI): వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), శ్రేయాస్ అయ్యర్(c), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా

శ్రీలంక (ప్లేయింగ్ XI): లసిత్ క్రూస్‌పుల్లే, సినెత్ జయవర్దన, సోహన్ డి లివెరా(w), అషెన్ బండార, సహన్ అరాచ్చిగే(సి), నువానీడు ఫెర్నాండో, చమిక కరుణరత్నే, వనుజా సహన్, విజయకాంత్ వియాస్కాంత్, తరిందు రత్నాయకే, బినుర ఫెర్నాండో

ఫైనల్స్‌కు పాక్‌
ఇవాళ జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి పాక్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్‌కు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం ఉంది. భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ విజేత పాకిస్తాన్‌తో ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటే, ఓడిన జట్టు బంగ్లాదేశ్‌తో కాంస్యం కోసం పోటీపడుతుంది.

ఇదీ చదవండి: Asian Games Men's Cricket: ఫైనల్స్‌కు పాకిస్తాన్‌


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement