source: BCCI X
గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో నిన్న జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అజేయ డబుల్ సెంచరీతో (133 బంతుల్లో 223 నాటౌట్; 26 ఫోర్లు, 8 సిక్సర్లు) ఇరగదీశాడు. తద్వారా పలు పాత రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు కొత్త రికార్డులు నెలకొల్పాడు.
టెస్టులు, వన్డేల్లో కెప్టెన్‌గా డబుల్ సెంచరీలు
ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంతకుముందెవరూ సాధించని ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్టులు, వన్డేల్లో కెప్టెన్‌గా డబుల్ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు.
2025లో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో (ఎడ్జ్‌బాస్టన్) గిల్ కెప్టెన్‌గా 269 పరుగులు చేశాడు. ఇప్పుడు వెస్టిండీస్‌పై వన్డేలో 223 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.
భారత్ రికార్డు విజయం
గిల్ రికార్డు డబుల్ సెంచరీకి రోహిత్ శర్మ (75 బంతుల్లో 101; 10 ఫోర్లు, 6 ఫోర్లు) మెరుపు శతకం తొడవ్వడంతో విండీస్ నిర్దేశించిన 406 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని భారత్ మరో 6.3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది రెండో అతి భారీ ఛేదన. అలాగే భారత్ వన్డేల్లో 400 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించడం ఇది మొదటిసారి.
ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో గిల్ సాధించిన మరిన్ని రికార్డులు
వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (117)
వన్డేల లక్ష్య ఛేదనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (223 నాటౌట్)
వన్డేల్లో కెప్టెన్‌గా అత్యధిక స్కోర్
రోహిత్ శర్మ (3) తర్వాత వన్డేల్లో ఒకటి కంటే ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన బ్యాటర్ (2)గా రికార్డు
ఇదీ చదవండి: పరువు కాపాడుకున్న ఆస్ట్రేలియా



