source: X
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్‌లో పాకిస్తాన్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.
వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా 13 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. తౌహిద్ హృదోయ్ 42 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో సుఫ్యాన్ ముఖీమ్ 3, అరాఫత్ మిన్హాస్ 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 112 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఆడుతూపాడుతూ ఛేదించింది. అబ్దుల్ సమద్ (30 నాటౌట్), హసన్ నవాజ్ (27 నాటౌట్) పాక్‌ను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు సైమ్ అయూబ్ (21), మాజ్ సదాకత్ (15) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ 11.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్‌కు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం ఉంది. ఇవాళే జరుగబోయే భారత్-శ్రీలంక రెండో సెమీఫైనల్ విజేత పాకిస్తాన్‌తో ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటే, ఓడిన జట్టు బంగ్లాదేశ్‌తో కాంస్యం కోసం పోటీపడుతుంది.
ఇదీ చదవండి: భారత్‌కు పరాభవం.. పాకిస్తాన్ చేతిలో ఓటమి


