Asian Games Cricket: సెమీ ఫైనల్లో వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం | Asian Games Semis IND vs SL: Sooryavanshi Risky Approach Backfires | Sakshi
Sakshi News home page

Asian Games Cricket: సెమీ ఫైనల్లో వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం

Oct 1 2026 11:00 AM | Updated on Oct 1 2026 11:32 AM

Asian Games Semis IND vs SL: Sooryavanshi Risky Approach Backfires

వైభవ్‌ సూర్యవంశీ (Photo Credit: BCCI X)

ఆసియా క్రీడలు- 2026 పురుషుల టీ20 క్రికెట్‌ టోర్నీ సెమీ ఫైనల్‌ సందర్భంగా.. టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ.. చాన్నాళ్ల తర్వాత తుదిజట్టులోకి వచ్చాడు. జపాన్‌ వేదికగా శ్రీలంకతో గురువారం నాటి మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ ఆరంభించాడు.

అభిషేక్‌, సంజూ విఫలం
తొలి ఓవర్లో లంక స్పిన్నర్‌ తరిందు రత్ననాయకె  బంతితో రంగంలోకి దిగగా వైభవ్‌.. ఆఖరి బంతికి ఫోర్‌ బాది ఖాతా తెరిచాడు. రెండో ఓవర్లో సహానే అరాచిగే బౌలింగ్‌లో దూకుడుగా ఆడే ప్రయత్నంలో అభిషేక్‌ (3 బంతుల్లో 7) పెవిలియన్‌ చేరాడు.

ఈ క్రమంలో వైభవ్‌కు సంజూ శాంసన్‌ తోడయ్యాడు. అయితే, మూడో ఓవర్‌ ఆఖరి బంతికే సంజూ (7) తరిందు బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. దీంతో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి రాగా.. వైభవ్‌ కాస్త దూకుడు పెంచాడు. నాలుగో ఓవర్లో చివరి రెండు బంతులకు వరుసగా ఫోర్లు బాది టచ్‌లోకి వచ్చాడు.

వైభవ్‌ ధనాధన్‌... 4,6,4
ఇక ఐదో ఓవర్లో తరిందుకు వైభవ్‌ చుక్కలు చూపించాడు. ఆఖరి మూడు బంతుల్లో వరుసగా 4,6,4 లతో చెలరేగాడు. అయితే, ఆరో ఓవర్లో బినుర ఫెర్నాండో తొలుత ఇబ్బంది పెట్టినా.. ఐదో బంతికి వైభవ్‌ సిక్సర్‌ బాది అతడిని పనిష్‌​ చేశాడు. ఈ లెఫ్టాండర్‌ ఓపెనర్‌ మెరుపుల కారణంగా భారత్‌ పవర్‌ ప్లే (తొలి ఆరు ఓవర్లు)లో రెండు వికెట్ల నష్టానికి 58 పరుగుల మేర మెరుగైన స్కోరు చేయగలిగింది.

ఊహించని షాక్‌ 
అయితే, ఏడో ఓవర్లోనూ దూకుడు కొనసాగించాలని చూసిన వైభవ్‌ సూర్యవంశీకి ఊహించని షాక్‌ తగిలింది. లంక కెప్టెన్‌, స్పిన్నర్‌ సహాన్‌ అరాచిగే రెండో బంతికి వైభవ్‌ను ఊరించగా.. భారీ షాట్‌కు యత్నించిన ఈ పదిహేనేళ్ల పిల్లాడు బంతిని గాల్లోకి లేపాడు. ఇంతలో సినేత్‌ జయవర్దెనె ఊహించని రీతిలో లో క్యాచ్‌ అందుకోగా.. వైభవ్‌ మెరుపులకు తెరపడింది. 

ఇదిలా ఉంటే.. పది ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 88 పరుగులే చేయగలిగింది. లంక స్పిన్నర్ల ధాటికి అభిషేక్‌ శర్మ (7), సంజూ శాంసన్‌ (7), శ్రేయస్‌ అయ్యర్‌ (13) చేతులెత్తేయగా.. వైభవ్‌ మాత్రం ఫర్వాలేదనిపించాడు. మొత్తంగా 21 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 38 పరుగులు రాబట్టాడు. దూకుడుగా ఆడే క్రమంలోవ్యూహం బెడిసి కొట్టి అర్ధ శతకం కూడా అందుకోకుండానే వైభవ​ అవుటయ్యాడు.
UPDATE:  IND vs SL వైభవ్‌ మెరుపులు.. ఇషాన్‌ కిషన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. భారత్‌ స్కోరెంతంటే?

చదవండి: ఇది అసలు క్రికెటే కాదు.. రికార్డుల కోసం మాత్రమేనా?: గంభీర్‌ అసహనం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement