అగ్రపీఠానికి చేరువలో కింగ్‌ కోహ్లి | Virat Kohli Climbs Upto No 2 In ICC ODI Rankings | Sakshi
Sakshi News home page

అగ్రపీఠానికి చేరువలో కింగ్‌ కోహ్లి

Oct 1 2026 10:50 AM | Updated on Oct 1 2026 11:05 AM

Virat Kohli Climbs Upto No 2 In ICC ODI Rankings

source: BCCI X

ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి భారీ జంప్‌ కొట్టాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో మెరుపు శతకంతో సాధించడంతో రేటింగ్‌ పాయింట్లు (796) గణనీయంగా పెంచుకున్నాడు. తద్వారా ఓ స్థానం మెరుగుపర్చుకొని మూడు నుంచి రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు.

విండీస్‌తో తొలి వన్డేలో సెంచరీ చేయడంతో టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కూడా రేటింగ్‌ పాయింట్లు (816) పెంచుకొని నంబర్‌ వన్‌ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. గిల్‌ ప్రస్తుతం కోహ్లి కంటే 20 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నాడు.

మరో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ (719) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌ నుంచి ముగ్గురు బ్యాటర్లు టాప్-4లో ఉండటం గమనార్హం.

ఏడో స్థానానికి కుశాల్‌
శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ మూడు స్థానాలు ఎగబాకి 674 పాయింట్లతో ఏడో స్థానానికి ఎగాబాకాడు. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 11వ స్థానానికి చేరాడు. ఆసీస్‌పై రెండో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఏకంగా 10 స్థానాలు మెరుగుపరుచుకుని 32వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

కుల్దీప్ యాదవ్‌కు ప్రమోషన్
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో ర్యాంక్‌కు ఎగబాకాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో నాలుగు వికెట్లు తీయడం అతడి ర్యాంకింగ్ మెరుగుదలకు దోహదపడింది.

దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ మూడో స్థానానికి ఎగబాకగా, శ్రీలంకకు చెందిన దునిత్ వెల్లాలాగే 12 స్థానాలు మెరుగుపరుచుకుని 26వ స్థానానికి చేరుకున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ కూడా ఐదు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్‌లో నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.

ఆల్‌రౌండర్ల విభాగానికొస్తే.. భారత్‌ నుంచి అక్షర్‌ పటేల్‌ అత్యుత్తంగా తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ టాప్‌ ప్లేస్‌ను నిలుపుకున్నాడు. 

ఇదీ చదవండి: వ‌న్డే చ‌రిత్ర‌లో తొలిసారి; ఒకే మ్యాచ్‌లో ఐదుగురు బ్యాట‌ర్లు శతకాలు



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement