Asian Games 2026: ధోనిని అధిగమించిన బుమ్రా | Jasprit Bumrah Surpasses MS Dhoni In List Of Most T20I Matches Played For India | Sakshi
Sakshi News home page

Asian Games 2026: ధోనిని అధిగమించిన బుమ్రా

Oct 1 2026 11:11 AM | Updated on Oct 1 2026 11:24 AM

Jasprit Bumrah Surpasses MS Dhoni In List Of Most T20I Matches Played For India

source: X

ఏషియన్‌ గేమ్స్‌ సెమీఫైనల్లో టీమిండియా ఇవాళ శ్రీలంకతో రెండో సెమీఫైనల్లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఓ ఘనత సొంతం సాధించాడు. కెరీర్‌లో 99వ టీ20 ఆడుతున్న అతడు.. భారత్‌ తరఫున అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానానికి చేరాడు. 

ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం ఎంఎస్‌ ధోనిని (98) అధిగమించాడు. గాయాలు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా చాలా మ్యాచ్‌లు మిస్‌ అయినప్పటికీ, బుమ్రా ఈ ఘనత సాధించడం​ విశేషం. భారత్‌ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రికార్డు రోహిత్‌ శర్మ పేరిట కొనసాగుతోంది.

భారత్ తరఫున అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు
159 – రోహిత్ శర్మ
138 – హార్దిక్ పాండ్యా
125 – విరాట్ కోహ్లీ
113 – సూర్యకుమార్ యాదవ్
106 – అక్షర్ పటేల్
99* – జస్ప్రీత్ బుమ్రా
98 – ఎంఎస్ ధోని

శ్రీలంకతో మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 16 ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. వైభవ్‌ సూర్యవంశీ (38), అభిషేక్ శర్మ (7), సంజూ శాంసన్‌ (7), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (13), అక్షర్‌ పటేల్‌ (8), తిలక్‌ వర్మ (2) ఔట్‌ కాగా.. ఇషాన్‌ కిషన్‌ (49), శివమ్‌ దూబే (1) క్రీజ్‌లో ఉన్నారు. 

లంక బౌలర్లలో సహాన్‌ అరచ్చిగే 2 వికెట్లతో సత్తా చాటగా.. తరిందు రత్నాయకే, వనుజ సహాన్‌, లసిత్‌ క్రూస్‌పుల్లే, నువనిదు ఫెర్నాండో తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తొలి సెమీఫైనల్లో పాక్‌ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. 

ఇదీ చదవండి: Asian Games Men's Cricket: ఫైనల్స్‌కు పాకిస్తాన్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement