ఇషాన్ కిషన్ (Photo Credit: BCCI X)
ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 క్రికెట్‌లో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ బ్యాట్ ఝులిపించాడు. జపాన్ వేదికగా శ్రీలంకతో గురువారం నాటి సెమీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై సహచరులంతా పెవిలియన్‌కు వరుస కట్టినా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ మాత్రం మొక్కవోని ఆత్మవిశ్వాసంతో రాణించాడు.
భారీ అర్ధ శతకం
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ 46 బంతులు ఎదుర్కొని.. నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 80 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి తోడు యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (21 బంతుల్లో 38) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది.
Pocket Dynamo's6️⃣
“IN HIS ARC, AND IT’S OUT OF THE PARK!” 🚀
Watch India vs Sri Lanka, Men’s Cricket Semi-Final 2, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026 #BaarBaarBharatHarBaarBharat pic.twitter.com/9KOtrjxmLL— Sony Sports Network (@SonySportsNetwk) October 1, 2026
సరికొత్త చరిత్ర
ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సెమీ ఫైనల్ సందర్భంగా.. అర్ధ శతక వీరుడు ఇషాన్ కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో భారత జట్టు తరఫున ఐదు లేదంటే అంతకంటే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు.
అంతర్జాతీయ టీ20లలో ఐదు లేదంటే అంతకంటే లోయర్ ఆర్డర్‌లో వచ్చి అత్యధిక స్కోరు సాధించిన భారత క్రికెటర్లు
👉ఇషాన్ కిషన్- 80 (నాటౌట్)- శ్రీలంక మీద 2026లో నిశిన్, జపాన్ వేదికగా
👉మనీశ్ పాండే- 79 (నాటౌట్)- సౌతాఫ్రికా మీద 2018లో, సెంచూరియన్, సౌతాఫ్రికా వేదికగా
👉యువరాజ్ సింగ్- 77 (నాటౌట్)- ఆస్ట్రేలియా మీద 2013లో, రాజ్‌కోట్, భారత్ వేదికగా
👉హార్దిక్ పాండ్యా- 71 (నాటౌట్)- ఆస్ట్రేలియా మీద 2022లో, మొహాలీ, భారత్ వేదికగా
👉రింకూ సింగ్- 69 (నాటౌట్)- అఫ్గానిస్తాన్ మీద 2024లో బెంగళూరు, భారత్ వేదికగా
👉రింకూ సింగ్- 68 (నాటౌట్)- సౌతాఫ్రికా మీద 2023లో గెబెర్హ, సౌతాఫ్రికా వేదికగా.
చదవండి: IND vs WI ODI: ఇది అసలు క్రికెట్ కానే కాదు: మండిపడ్డ గంభీర్


