అంబటి రాయుడు మెరుపులు వృథా.. ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌ ఓటమి | England champions beat India champions by 21 runs 2026 | Sakshi
Sakshi News home page

WCL 2026: అంబటి రాయుడు మెరుపులు వృథా.. ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌ ఓటమి

Oct 5 2026 7:50 AM | Updated on Oct 5 2026 8:08 AM

England champions beat India champions by 21 runs 2026

PC: X

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2026 టోర్నీలో ఇండియా ఛాంపియ‌న్స్‌కు తొలి ఓట‌మి ఎదురైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ ర‌వి బొపారా విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన బొపారా భారత బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్‌ సమితా్‌ పటేల్‌ సైతం(44 బంతుల్లో 57) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ధావల్‌ కులకర్ణి, అభిమన్యు మిథున్‌ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌కు యువరాజ్‌ సింగ్‌ దూరం కావడంతో భారత జట్టును స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ లీడ్‌ చేశాడు.

రాయుడు మెరుపులు వృథా
అనంతరం 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఛాంపియన్స్‌ జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నమన్ ఓజా(2) తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరాడు. అనంతరం రాబిన్‌ ఉతప్ప(31), అంబటి రాయుడు(47) ఇంగ్లండ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.

అయితే వీరిద్దరూ ఔటయ్యాక పరిస్థితి తారుమారైంది. మిడిలార్డర్‌లో భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖరిలో రిషి ధావన్‌(29), పీయూష్‌ చావ్లా(34) దూకుడగా ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. లక్ష్య చేధనలో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఓటమి పాలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement