చైనా స్విమ్మింగ్ టీనేజ్ సంచలనం యు జిది... థాయ్‌లాండ్ రన్నర్ పురిపోల్ బూన్‌సన్... 20వ ఆసియా క్రీడల్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (ఎంవీపీ) అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇద్దరికి 25 వేల డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ ఇచ్చారు. ఆదివారం ముగిసిన ఈ క్రీడల్లో 13 ఏళ్ల యు జిది మూడు స్వర్ణ పతకాలు సాధించింది. యు జిది మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే విభాగాల్లో విజేతగా నిలిచింది.
ఈ మూడు విభాగాల్లో రెండు ఆసియా క్రీడల రికార్డులుకాగా, ఒకటి ఆసియా రికార్డు ఉండటం విశేషం. అథ్లెటిక్స్‌లో 20 ఏళ్ల బూన్‌సన్ పురుషుల 100 మీటర్ల, 200 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు సాధించాడు. 4్ఠ100 మీటర్ల రిలేలో థాయ్‌లాండ్ బృందానికి రజతం అందించాడు. 100 మీటర్లను 9.90 సెకన్లలో పూర్తిచేసి ఆసియా క్రీడల రికార్డును నెలకొల్పిన బూన్‌సన్... 200 మీటర్లను 19.88 సెకన్లలో ముగించి ఆసియా రికార్డును సృష్టించాడు.


