PC: CA Twitter
సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ రెడ్‌బాల్ సిరీస్‌కు ఎంపిక చేసిన తమ జట్టులో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక మార్పులు చేసింది. గాయపడిన వికెట్ కీపర్-బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ స్థానాన్ని న్యూ సౌత్ వేల్స్ ఆటగాడు నిక్ మ్యాడిన్సన్స్‌తో ఆసీస్ సెలక్టర్లు భర్తీ చేశారు. నిక్ మ్యాడిన్సన్ దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
మ్యాడిన్సన్ చివరగా 2016లో ఆసీస్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తుండడంతో అతడికి జాతీయ సెలక్టర్ల నుంచి మళ్లీ పిలుపువచ్చింది. మరోవైపు 29 ఏళ్ల అన్ క్యాప్డ్ ప్లేయర్ సామ్ హార్పర్‌కు తొలిసారి ఆసీస్ టెస్టు జట్టులో చోటు లభించింది.
29 ఏళ్ల హార్పర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 68 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 27.20 సగటుతో 2,802 పరుగులు సాధించాడు. జట్టు సమతుల్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపారు. కాగా ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌లో చేతి వేలి గాయం బారినపడిన ఇంగ్లిష్.. టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
అయితే మూడో వన్డేలో కుడి చేతికి గాయమైన మాట్ రెన్‌షా మాత్రం తొలి టెస్టులో ఆడే అవకాశం ఉంది. పొత్తికడుపు కండరాల నొప్పితో బాధపడుతున్న కామెరాన్ గ్రీన్ అందుబాటుపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా జరగనుంది.
సౌతాఫ్రికాతో టెస్టులకు ఆసీస్ జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, కామెరాన్ గ్రీన్, సామ్ హార్పర్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, నిక్ మాడిన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నెసర్, మాథ్యూ రెన్‌షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.
చదవండి: వన్డే వరల్డ్‌కప్.. టీమిండియా షెడ్యూల్ ఇదే


