సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. యువ సంచలనానికి చోటు | South Africa squad for Australia Tests, Rabada named in extended squad | Sakshi
Sakshi News home page

AUS vs SA: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. యువ సంచలనానికి చోటు

Sep 28 2026 2:42 PM | Updated on Sep 28 2026 2:54 PM

South Africa squad for Australia Tests, Rabada named in extended squad

PC: SA Twitter

డర్బన్ వేదికగా అక్టోబర్ 9 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం 18 మంది సభ్యులతో కూడిన ప్రిలిమినరీ జట్టును సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. తొడ కండరాల గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ కాగిసో రబాడకు ఈ ప్రాథమిక జట్టులో చోటు దక్కింది. అయితే సిరీస్ ఆరంభానికి ముందే రబాడ తన పూర్తి ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది.

అదేవిధంగా, స్టార్ పేస్ బౌలర్లు గెరాల్డ్ కోయెట్జీ, అన్రిచ్ నోర్ట్జే, డేన్ ప్యాటర్సన్‌లను ప్రోటీస్ సెలక్టర్లు తిరిగి టెస్టు జట్టులోకి తీసుకున్నారు. ఇక దక్షిణాఫ్రికా 'ఎ' జట్టు తరఫున అద్భుతంగా రాణించిన అన్‌క్యాప్డ్ బ్యాటర్ మార్క్వెస్ అకెర్‌మన్‌కు తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు లభించింది. 

టాప్ ఆర్డర్‌లో స్థానం కోసం అకెర్‌మన్, టోనీ డి జోర్జీ మరియు ట్రిస్టన్ స్టబ్స్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా ఈ మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇక ఇప్పటికే జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరొక మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సఫారీలు కైవసం చేసుకున్నారు.

ఆసీస్‌ తొలి టెస్టుకు సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా, మార్క్వెస్ అకెర్‌మాన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కార్బిన్ బాష్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, సైమన్ హర్మర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, ఐడెన్ మర్క్రామ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, అన్రిచ్ నోర్ట్జే, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్జ్‌,కైల్ వెర్రెయిన్
చదవండి: బస్సు నుంచి పడిపోయిన రోహిత్‌ శర్మ.. కోహ్లి రియాక్షన్‌ వైరల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement