సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య నిన్న జరిగిన రెండో వన్డే మ్యాచ్ ఓ అరుదైన ఘనతకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తరఫున యాన్సెన్ సోదరులు (మార్కో, డువాన్) తొలిసారి బరిలోకి దిగారు. తద్వారా సౌతాఫ్రికా తరఫున కలిసి బరిలోకి దిగిన 9వ సోదరుల జోడీగా రికార్డుల్లోకెక్కారు.
ఈ పరిణామ నేపథ్యంలో సౌతాఫ్రికా తరఫునే కాకుండా, ఇతర దేశాల తరఫున కూడా ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగిన పాపులర్ బ్రదర్స్‌పై ఓ లుక్కేద్దాం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు చాలామంది సోదరులు కలిసి బరిలోకి దిగారు. వీరిలో క్లిక్ అయ్యింది మాత్రమే పలువురే. ఈ కథనంలో ఆ పాపులర్ బ్రదర్స్‌ను ఓసారి గుర్తు చేసుకుందాం. ముందుగా సౌతాఫ్రికా విషయానికొస్తే..
యాన్సెన్ సోదరులకు ముందు సౌతాఫ్రికా తరఫున ఎనిమిది బ్రదర్స్ జోడీలు కలిసి బరిలోకి దిగినప్పటికీ.. గుర్తింపు పొందిన పెయిర్స్ మాత్రం మూడే. అందులో గ్రేమ్-పీటర్ పొలాక్, పీటర్-గ్యారీ కిర్‌స్టన్, అల్బీ-మోర్నీ మోర్కెల్ జోడీలు ఉన్నాయి. మలాన్ (పీటర్, జన్నెమన్), హెర్మన్ (రూబిన్, జోర్డన్) సోదరులు కూడా అడపాదడపా గుర్తింపు కలిగి ఉన్నారు.
ఇతర దేశాల ప్రముఖ బ్రదర్స్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్-మార్క్ వా సుప్రసిద్ద బ్రదర్స్ జోడీ. భారత్‌కు చెందిన ఇర్ఫాన్-యూసుఫ్ పఠాన్ జోడీ కూడా విశ్వవ్యాప్త గుర్తింపు కలిగి ఉంది.
వా సోదరులు (ఆస్ట్రేలియా): స్టీవ్ వా, మార్క్ వా 1990లలో ఆస్ట్రేలియా టెస్టు, వన్డే జట్లలో కీలక సభ్యులుగా కలిసి ఆడారు.
పఠాన్ సోదరులు (భారత్): ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ భారత్ తరఫున కలిసి ఆడారు. 2007 టీ20 ప్రపంచకప్ విజేత భారత జట్టులోనూ ఇద్దరూ ఉన్నారు.
పాండ్యా సోదరులు (భారత్): హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కలిసి ఆడారు.
చాపెల్ సోదరులు (ఆస్ట్రేలియా): ఇయాన్, గ్రెగ్ చాపెల్ ఆస్ట్రేలియా తరఫున కలిసి ఆడగా, మరో సోదరుడు ట్రెవర్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడాడు.
మొహమ్మద్ సోదరులు (పాకిస్తాన్): హనీఫ్, సాదిక్, ముష్తాక్, వజీర్ మొహమ్మద్‌లు పాకిస్తాన్ తరఫున ఆడిన ప్రముఖ సోదరులు.
మోర్కెల్ సోదరులు (దక్షిణాఫ్రికా): అల్బీ, మోర్నీ మోర్కెల్ కూడా దక్షిణాఫ్రికా తరఫున కలిసి ఆడారు.
కరన్ సోదరులు (ఇంగ్లండ్): టామ్, సామ్ కరన్‌లు ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు.
ఓ'బ్రియన్ సోదరులు (ఐర్లాండ్): కెవిన్, నీల్ ఓ'బ్రియన్‌లు ఐర్లాండ్ తరఫున కలిసి ఆడారు.
ఇలా చెప్పుకుంటూ పోతే అంతర్జాతీయ క్రికెట్‌లో కలిసి ఆడిన బ్రదర్స్ జోడీలు చాలానే ఉన్నాయి.
మార్ష్ సోదరులు (షాన్-మిచెల్, ఆస్ట్రేలియా)
లీ సోదరులు (షేన్-బ్రెట్, ఆస్ట్రేలియా)
హస్సీ సోదరులు (మైక్-డేవిడ్, ఆస్ట్రేలియా)
హోలియోక్ సోదరులు (ఆడమ్-బెన్, ఇంగ్లండ్)
మెక్‌కల్లమ్ సోదరులు (బ్రెండన్-నాథన్, న్యూజిలాండ్)
ఫ్లవర్ సోదరులు (ఆండీ-గ్రాంట్, జింబాబ్వే)
ఇదీ చదవండి: SA vs AUS: సౌతాఫ్రికా కెప్టెన్ సూపర్ సెంచరీ.. ధోని సరసన


