సౌతాఫ్రికా కెప్టెన్‌ సూపర్‌ సెంచరీ.. ధోని సరసన | Temba Bavuma Joins Babar Azam, MS Dhoni In Elite ODI List With Century vs Australia | Sakshi
Sakshi News home page

SA vs AUS: సౌతాఫ్రికా కెప్టెన్‌ సూపర్‌ సెంచరీ.. ధోని సరసన

Sep 27 2026 7:00 PM | Updated on Sep 27 2026 7:07 PM

Temba Bavuma Joins Babar Azam, MS Dhoni In Elite ODI List With Century vs Australia

జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఎయిడెన్ మార్‌క్రమ్, ఆ తర్వాత కాసేపటికే క్వింటన్ డికాక్ (15) పెవిలియన్‌కు చేరారు.

ఈ సమయంలో బవుమా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 112 బంతుల్లో తన వన్డే కెరీర్‌లో 6వ సెంచరీ మార్కును పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 116 బంతులు ఎదుర్కొన్న బవుమా.. 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేసి అవుటయ్యాడు.

అతడితో పాటు డేవిడ్ మిల్లర్ (93 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్లతో 142) భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 360 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఎంఎస్ ధోనీ రికార్డు సమం:
ఈ మ్యాచ్‌లో శతక్కొట్టిన బవుమా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో ఆస్ట్రేలియాపై కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ఎంఎస్ ధోనీ, బాబర్ ఆజమ్, స్టీఫెన్ ఫ్లెమింగ్‌ల సరసన బవుమా చేరాడు. వీరంతా కెప్టెన్‌గా ఆసీస్‌పై చెరో 2 సెంచరీలు సాధించగా.. ఈ జాబితాలో ఫాఫ్ డుప్లెసిస్ (3), విరాట్ కోహ్లి (3) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.

మరోవైపు సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో కెప్టెన్‌గా డుప్లెసిస్ (5 సెంచరీలు) సరసన బవుమా నిలిచాడు. బవుమా ఇప్పటివరకు కెప్టెన్‌గా 5 వన్డే సెంచరీలు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement