చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. అజారుద్దీన్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్ | Virat Kohli Breaks Mohammad Azharuddins 28-Year-Old Record During 1st India-West Indies ODI | Sakshi
Sakshi News home page

IND vs WI: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. అజారుద్దీన్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్

Sep 27 2026 5:01 PM | Updated on Sep 27 2026 5:14 PM

Virat Kohli Breaks Mohammad Azharuddins 28-Year-Old Record During 1st India-West Indies ODI

తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. విండీస్‌పై అత్యధిక వన్డేలు ఆడిన భారత ప్లేయర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు.. ఇది కరేబియన్ జట్టుపై కోహ్లికి 44వ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం.

అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ పేరిట ఉండేది. అజారుద్దీన్‌ 1985-1998 మధ్య విండీస్‌పై 43 వన్డేలు ఆడాడు. తాజా మ్యాచ్‌తో 28 ఏళ్ల అజారుద్దీన్ ఆల్‌టైమ్ రి​కార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. కాగా ప్రస్తుత భారత జట్టులోని యాక్టివ్ క్రికెటర్లలో ఎవరూ లేరు.

కోహ్లి ఇప్పటివరకు విండీస్‌పై 41 వ‌న్డే ఇన్నింగ్స్‌ల‌లో 2,261 పరుగులు చేసి లీడింగ్ ర‌న్ స్కోర‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అంతేకాకుండా విండీస్‌పై విరాట్ రికార్డు స్దాయిలో 9 వ‌న్డే సెంచ‌రీలు చేయ‌డం విశేషం. ఇక ఓవరాల్‌గా వెస్టిండీస్‌పై అత్యధిక వన్డేలు ఆడిన రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్లు జావేద్ మియాందాద్, వసీం అక్రమ్‌ల పేరిట ఉంది. వీరిద్దరూ కరీబియన్ జట్టుపై చెరో 64 వన్డే మ్యాచ్‌లు ఆడారు.

విండీస్‌పై అత్యధిక వన్డేలు ఆడిన భారత ఆటగాళ్లు వీరే

విరాట్ కోహ్లీ – 44 మ్యాచ్‌లు

మహమ్మద్ అజారుద్దీన్ – 43 మ్యాచ్‌లు

కపిల్ దేవ్ – 42 మ్యాచ్‌లు

రాహుల్ ద్రావిడ్ – 40 మ్యాచ్‌లు

మహేంద్ర సింగ్ ధోనీ – 39 మ్యాచ్‌లు
చదవండి: IND vs WI: బెడిసి కొట్టిన టీమిండియా ప్ర‌యోగం.. ఉతికారేసిన విండీస్‌ బ్యాటర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement